రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టాంపులు, రెవెన్యూ శాఖ మూడు రోజుల పాటు దాడులు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ దాడుల్లో మార్గదర్శికి సంబంధించి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు జరిగిలేదని ప్రభుత్వ అధికారులు గుర్తించారు.
అధికారులు జరిపిన తనిఖిల్లో సంస్థ వ్యవహారాల్లో ఏ విధమైన వ్యత్యాసాలను కనుగొనలేకపోయారని, ఉన్నతాధికారుల ఒత్తిడితోనే మార్గదర్శి నిర్వాహకులు అక్రమాలను అంగీకరించే పత్రంపై సంతకం చేసినట్లు తెలుస్తుంది.ఈ తనిఖిలకు సంబంధించి సాక్షి ఓ వార్తను వెలువరించింది.
చిట్‌ఫండ్ వ్యాపారం పేరుతో మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాక్షి కథనం ప్రచురించింది.
ఈ తనిఖిలకు సంబంధించి చెప్పుకోదగ్గ ఆధారాలు లేవు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మౌత్‌పీస్‌గా పేరు తెచ్చుకున్న సాక్షి పార్టీ ఆలోచనలకు తగ్గట్లుగా ఆరోపణలు చేసింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, దాడులలో కీలక అధారాలు లభించినట్లు ఓ పూర్తి కథనాన్ని రాసింది.అయితే ఈ దాడుల గురించి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ అతి ఉత్సాహంతో ఈ వార్తను వెల్లడించింది.
అయితే ఇక్కడ ప్రభుత్వం తరపున సాక్షి ఎందుకు స్పందిస్తుందనేది ప్రశ్న.ఇక సాక్షి , వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన రాజకీయ ఆరోపణలు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే ఇంతకుముందు ఇలానే రాజకీయ ప్రతీకారం కోసం కేసులు వేయడం, తర్వాత వాటిని కోర్టుల్లో ఓడిపోవడ ఏపీ ప్రజలు చూస్తునే ఉన్నారు.ప్రభుత్వం ప్రత్యర్థులను టార్గెట్ చేసే తీరు అనుమానస్సదంగా ఉంటుంది.అధారాలు లేకుండా చర్యలకు దిగడం ఆ తర్వాత కోర్టుల్లో చుక్కెదురు కావడం ప్రభుత్వ స్థాయిని దిగజార్చేలా కనిపిస్తుంది.ఇక అభివృద్ది అంశాన్ని వదిలేసి రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పని చేస్తుందని ప్రతి పక్షాలు ఆరోపిస్తునే ఉన్నాయి.2024 ఎన్నికలు సమిపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి పక్షాల బలాలపై దెబ్బ కొట్టేలా వూృహాలు రచిస్తుందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.