నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అవసరం లేదు ఆయన అటు హీరో గాను, ఇటు ప్రొడ్యూసర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే ఈ సంవత్సరం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ తో వచ్చిన అమిగోస్ సినిమా మీద కళ్యాణ్ రామ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది అసలు కళ్యాణ్ రామ్ కి ఏడూ ఎనిమిది సంవత్సరాలకి ఒక సాలిడ్ హిట్ పడుతుంది
కానీ ఆ తర్వాత మాత్రం వచ్చే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కి పడకపోవడం నిజంగా ఆయన దురదృష్టం అనే చెప్పాలి…అయితే ఈ విషయం లో మనం కళ్యాణ్ రామ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన ఎంత సేపు సినిమాలు చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఎలాంటి సినిమాలు చేయాలి అనే దాని మీద ఆయన ఎప్పుడు దృష్టి పెట్టినట్లుగా కనిపించడం లేదు.
ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కొత్త గానే ఉంటుంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది అది ఏంటి అనేది ఆయన ఒకసారి గమనిస్తే మంచిది…ఇక ఇది ఇలా ఉంటె తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా బింబిసారా 2 తీస్తారా లేక వేరే సినిమా ఉంటుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది…కళ్యాణ్ రామ్ లాంటి హీరో కి ఒక మంచి మాస్ స్టోరీ కానీ పడితే నిజంగా అది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…