కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య దూరం ఎందుకు పెరిగిందంటే?

టిఆర్ఎస్ పార్టీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బంధం ముగియనుంది.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశాంత్ కిషోర్ మధ్య దూరం పెరిగింది.

 Why Has The Distance Between Kcr And Prashant Kishore Increased Details, Kcr, Pr-TeluguStop.com

త్వరలో ఉప ఎన్నిక జరుగునున్న మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల సర్వేకు వెళ్లిన పీకే బృందం ఆ సర్వే కూడా చేయకుండానే వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా రాష్ట్రంలో టిఆర్ఎస్కు రాజకీయ వ్యవహారాల అందించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ టీం తరపున పనిచేస్తున్న సుమారు 300 మందిలో 200 మందిని ఏపీకి పంపించాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు.

ఈ పరిణామాలను బట్టి టిఆర్ఎస్ తో చేసుకున్న ఒప్పందానికి ప్రశాంత్ కిషోర్ ముగింపు పలికినట్లేనని విశ్వసనీయ వర్గాలు అంటున్నారు.టిఆర్ఎస్ కోసం పీకే టీం దాదాపు 5 నెలల నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి టిఆర్ఎస్ కోసం తొలుత సునీల్ కొనుగోలు సంస్థ పనిచేసింది.అయితే ఆ సంస్థను పక్కనపెట్టి ప్రశాంత్ కిషోర్ టీంని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెచ్చుకున్నారు.ఆ తర్వాత సునీల్ కనుగోలు సంస్థ కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా పనిచేయడం ప్రారంభించింది.ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ సంస్థతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సమావేశంలో ప్రశ్నించగా పీకే తన స్నేహితుడు అని ఆయన చెప్తున్నారు.15 ఏళ్ల నుంచి తాము టచ్ లో ఉన్నామని అంటున్నారు.తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా కలిసే వాళ్ళమని సీఎం చెబుతున్నారు.

మరోవైపు టిఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలోను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు.

Telugu Congress, Pac, Kcr National, Strategist, Prakash Raj, Prasanth Kishor, Pr

టిఆర్ఎస్ తో తెగ తెంపులు చేసుకోవాలని పీకే నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలే లక్ష్యంగా పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అనడం ఒక కారణం.కాగా ప్రశాంత్ కిషోర్ బృందానికి సీఎం కేసీఆర్ సమయం ఇవ్వకపోవడం వారి వ్యూహాలను వినకపోవడం విన్నవాటిని పట్టించుకోకపోవడం మరో కారణమని తెలుస్తోంది.

మొదటిగా తెలంగాణలో టిఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం అన్నదే ప్రశాంత్ కిషోర్ బృందానికి కేసీఆర్ ఇచ్చిన లక్ష్యం.దీనికోసం అమలు చేయాల్సిన ప్రచార రాజకీయ వ్యవహారాలన్నిటిని ఆ బృందం అందించాలన్నది ఒప్పందం.

Telugu Congress, Pac, Kcr National, Strategist, Prakash Raj, Prasanth Kishor, Pr

అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు.తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ఇతర రాష్ట్రాల నేతలు కూడా తనను ఆహ్వానిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.ఇది ఆచరణలోకి వస్తే టిఆర్ఎస్ కోసం పీకే బృందం దేశవ్యాప్తంగా పని చేయాల్సి ఉంటుంది.కానీ కెసిఆర్ తో ఒప్పందం తమకు తెలంగాణ వరకేనని ఆయనతో ఒప్పందం సమయంలో జాతీయ రాజకీయాల ప్రస్తావనే లేదని ప్రశాంత్ కిషోర్ అంటున్నట్లు తెలిసింది.

పైగా పీకే బృందం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పనిచేస్తుంది.ఇప్పుడు దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కోసం పనిచేయాలంటే ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న పనిని పూర్తి స్థాయిలో చేయలేమనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు.

దీంతో టిఆర్ఎస్ కోసం జాతీయ రాజకీయాల్లో వ్యూహకర్తగా పనిచేయడం వీలుకాదని పీకే చెప్పినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube