పుష్ప 2 కోసం కాజల్ 'ఉ' అంటుందా..!

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది.

ఏమాత్రం అంచనాలు లేకుండా పుష్ప పార్ట్ 1 హిందీలో 100 కోట్ల పైన రికార్డ్ వసూళ్లని రాబట్టింది.పుష్ప ది రైజ్ లో సమంత చేసిన స్పెషల్ ఐటం సాంగ్ ఉ అంటావా మామా సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.

ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అక్కడ క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈ సాంగ్ తో దుమ్ముదులిపేసింది.ఇక ఇదిలాఉంటే పుష్ప 2 కోసం కూడా సుకుమార్ అదే రేంజ్ లో మరో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సాంగ్ కోసం ఈసారి కాజల్ అగర్వాల్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట.కాజల్ కూడా ఆల్రెడీ ఒకసారి స్పెషల్ సాంగ్ చేసింది.

Advertisement

అయితే పెళ్లై ఓ పిల్లాడు కూడా ఉన్న కాజల్ ఈ టైం లో స్పెషల్ సాంగ్ కి ఓకే చెబుతుందా అన్నది డౌటే.కానీ కాజల్ తన కం బ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని ఆ సాంగ్ ఆఫర్ కి ఓకే చెప్పిందని అంటున్నారు.

పుష్ప 2 లో కాజల్ స్పెషల్ సాంగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది కాజల్ మళ్లీ ఈ స్పెషల్ సాంగ్ తో జోడీ కడుతుంది.

Advertisement

తాజా వార్తలు