హనుమంతుడు పై శని ప్రభావం ఎందుకు చూపలేదో తెలుసా?

దేవతలలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడు ప్రభావం ప్రతి ఒక్క దేవతలపైన పడింది.శని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

కానీ శని తన ప్రభావాన్ని ఇద్దరు దేవతలపై చూపలేదని పురాణాలు చెబుతున్నాయి.విగ్నేశ్వరుడు, హనుమంతునిపై శని ప్రభావం పడలేదని పురాణాలు పేర్కొన్నాయి.

శని ప్రభావం హనుమంతుడిపై ఏ విధంగా పడలేదో ఇక్కడ తెలుసుకుందాం.రామాయణం ప్రకారం లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి హనుమంతుడు అతని సైన్యం సముద్రంలో వారధి నిర్మిస్తారు.

ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు అక్కడికి చేరుకోవడంతో ఆంజనేయుడు వంతెన నిర్మాణానికి శనీశ్వరుడు సాయంగా వచ్చాడని భావిస్తాడు.కానీ శని తన ప్రభావాన్ని హనుమంతుడిపై చూపడం కోసం అక్కడికి వచ్చినట్లు తెలిపి శని హనుమంతుని తలపై ఎక్కి కూర్చున్నాడు.

Advertisement

ఈ విధంగా శని తలపై కూర్చోవడం వల్ల హనుమంతుడి పనికి ఎంతో అంతరాయం కలిగింది.సీతమ్మను రక్షించుకోవడం కోసం చేస్తున్న పనిలో శని అంతరాయం కలిగిస్తూ ఉండడంతో హనుమంతుడు, శనీశ్వరుడినికి తలమీద రాళ్లను మోయాలి, తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు.

 అందుకు శనీశ్వరుడు సమ్మతించి ఆంజనేయుని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.కానీ హనుమంతుడు తనకున్న బలంతో శనీశ్వరుని తన పాదాల కింద అణచివేయడంతో అతని పట్టుకోవడం వీలు కాలేకపోయింది.

అదేవిధంగా హనుమంతుడి నుంచి తప్పించుకోవడానికి శనికి వేరే మార్గం లేక తపించి పోయాడని పురాణాలు చెబుతున్నాయి.ఆ సమయంలో శనీశ్వరుడు హనుమంతునితో నాకు విముక్తి కలిగించు, ఇకపై నీ జోలికి ఎప్పుడూ రాను, అదేవిధంగా నీకు భక్తితో పూజించే నీ భక్తుల పై కూడా నా ప్రభావం చూపని వేడుకోవడంతో హనుమంతుడు శనిని విడిచి పెట్టినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.

అందుకోసమే అప్పటినుంచి శని ప్రభావం ఉన్న వారు హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు