Venkatesh : అన్న కోసం ఆ స్టార్ హీరో తో గొడవ పెట్టుకున్న వెంకటేష్.. కారణం..?

దగ్గుబాటి వెంకటేష్ ( Daggubati Venkatesh ) అనేకంటే ఎక్కువగా విక్టరీ వెంకటేష్ గానే ఈయన గుర్తింపు సంపాదించారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని జానర్ల సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా వెంకటేష్ కి గుర్తింపు ఉంది.

 Why Did Venkatesh Fight With That Star Hero For Anna-TeluguStop.com

ఈయన కామెడీ యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్క జానర్లలో సినిమాలు చేశారు.అయితే వెంకటేష్ కేవలం సోలో హీరో గానే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించారు.

అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Sithamma Vakitlo Sirimalle Chettu ) , సంక్రాంతి,గోపాల గోపాల,ఎఫ్2,ఎఫ్3 వంటి ఎన్నో సినిమాల్లో చేశారు.అయితే ఈయన మల్టీస్టారర్ సినిమాలో చేస్తున్న సమయంలో అన్న సురేష్ బాబు కోసం ఓ స్టార్ హీరోతో గొడవ పెట్టుకున్నారట.

మరి హీరో ఎవరు.ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్ గొడవ పెట్టుకున్న హీరో ఎవరు కాదు పవన్ కళ్యాణ్.వెంకటేష్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గోపాల గోపాల ( Gopala Gopala ) అనే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే వెంకటేష్ ఎక్కువగా స్క్రీన్ లో కనిపిస్తారు.ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించి ఒక గెస్ట్ రోల్ చేసినట్టు అందరికీ అనిపిస్తుంది .అయితే ఈ సినిమా కోసం 20 కాల్షీట్స్ ని దర్శక నిర్మాతలకు ఇచ్చారట పవన్ కళ్యాణ్.

Telugu Daggubatisuresh, Gopala Gopala, Pawan Kalyan, Sankranthi, Sitammavakitlo,

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) కు సంబంధించిన సన్నివేశాలు 20 రోజుల్లో పూర్తి కాకపోవడంతో మరో 15 రోజులు పొడిగించాల్సి వచ్చిందట.ఆ 15 రోజులకి ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన వెంకటేష్ అన్న సురేష్ బాబు అగ్రిమెంట్ ప్రకారం ఇస్తానని చెప్పి ఆ తర్వాత మాట దాటేసారట.దాంతో కోపంలో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే తన అన్నని అన్నందుకు వెంకటేష్ చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట పవన్ కళ్యాణ్ తో.

Telugu Daggubatisuresh, Gopala Gopala, Pawan Kalyan, Sankranthi, Sitammavakitlo,

ఆ తర్వాత కొద్ది రోజులు వీరి మధ్య మాటలు కూడా లేవట.ఇక ఇదే విషయం గురించి సురేష్ బాబు ( Suresh Babu ) ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అడగగా అలాంటిదేమీ లేదు ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్ అంటూ ఆ గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ కళ్యాణ్ వెంకటేష్ మధ్య మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయాయి.అలా సురేష్ బాబు కోసం వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో కూడా చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube