ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలుగా గుర్తింపు పొందడానికి కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందిన నటుడు శ్రీకాంత్( Srikanth ).
ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.ఇలాంటి క్రమంలోనే ఆయనతో అప్పట్లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రాశి( Rashi ) ఒక విషయంలో శ్రీకాంత్ ను తిట్టినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ వార్తలు నెట్లో చాలా వైరల్ గా మారుతున్నాయి.అయితే రాశి శ్రీకాంత్ ను తిట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రేయసి రావే సినిమా( Preyasi Rave movie ) షూటింగ్ టైంలో శ్రీకాంత్, రాశి మధ్య షూట్ చేయాల్సిన కొన్ని సీన్లకు శ్రీకాంత్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల లేట్ గా వచ్చాడంట.దాంతో రెండు గంటల పాటు మేకప్ వేసుకొని సెట్ లో కూర్చున్న రాశి శ్రీకాంత్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా ఇబ్బంది పడిందట.దానివల్ల ఆమె శ్రీకాంత్ రాగానే ఆయన మీదికి కొంచెం కోపం గా రియక్ట్ అయినట్టు గా తెలుస్తుంది.
కానీ శ్రీకాంత్ అప్పుడు తన వైఫ్ కి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చిందని అందువల్లే లేట్ అయ్యిందని క్లారిటీ ఇవ్వడంతో రాశి మళ్ళీ తనకు సారి చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే అప్పట్లో శ్రీకాంత్, రాశి కాంబో కి మంచి క్రేజ్ ఉండేది.వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక ఇప్పటికీ కూడా ఆ సినిమాలను టివిలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు అంటే వీళ్ళ క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక రీసెంట్ గా కూడా వీళ్ళు ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు చాలా సందడి చేశారు.