ఒకప్పుడు వెంకటేష్, నాగార్జున( Venkatesh, Nagarjuna ) ల మధ్య కొంతమేరకు పోటీ అనేది ఉండేది అని చాలా వార్తలేతే వచ్చేవి.ఇద్దరి మధ్య ఎక్కువగా మాటలు కూడా ఉండకపోయేవని సినిమా ఇండస్ట్రీలో చాలా కథనాలు అయితే వచ్చేవి ఎందుకు అంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మీని( Lakshmi ) నాగార్జున పెళ్లి చూసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకి డివోర్స్ ఇవ్వడంతో వాళ్ల మధ్య మాటలు లేవు అని చాలా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.
అయితే రీసెంట్ గా నాగచైతన్య హీరో గా చేస్తున్న తండేల్ సినిమా( Tandel movie ) ఓపెనింగ్ ఫంక్షన్ కి ఇద్దరు చీఫ్ గెస్ట్ లుగా వచ్చి నాగచైతన్య ని ఆశీర్వదించారు.దాంతో వీరిద్దరి మధ్య గొడవలు లేవు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది.
అయితే ఒకానొక టైమ్ లో వెంకటేష్ చేయాల్సిన సినిమాని నాగార్జున వెంకటేష్ మీద కోపంతో తనే చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.నిన్నే పెళ్ళాడుతా సినిమా ని కృష్ణవంశీ ముందుగా వెంకటేష్ కి చెప్పాడు.అయితే వెంకటేష్ ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ వర్మ తో నాగార్జున శివ సినిమా చేసినపుడు నాగార్జునకి కృష్ణవంశీ బాగా పరిచయం ఉండడంతో కృష్ణవంశీని పిలిపించుకొని స్టోరీ విని ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ( Annapurna Studios banner )మీద ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి నిన్నేపెళ్లాడుతా మూవీ చేశాడు.
దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.అలా వెంకటేష్ మీద కోపంతో నాగార్జున చేసిన సినిమా ఆయన కెరీయర్ లోనే ఒక బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.అలాగే నాగార్జునకి సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టింది…ఇక ఈ సినిమా తో ఆయన మరొక హిట్ అందుకొని ముందుకు దూసుకెళ్లాడు…
.