Abhiram Daggubati Ahimsa : సురేష్ బాబు లాంటి నిర్మాత కొడుకు సినిమాను విడుదల చేయలేక పోతున్నాడా?

దగ్గుబాటి అభిరామ్( Abhiram Daggubati ).శ్రీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఇతని పేరు బాగా పాపులర్ అయింది.

అయితే అన్ని విషయాలను దాటుకొని ప్రస్తుతం ఆయన డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అహింస అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.సురేష్ బాబు తన సొంత బ్యానర్ లో అభిరామ్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు.

అయితే వచ్చిన చిక్కల్లా ఒకటే ఎంత పెద్ద బ్యానర్ అయితే ఏముంది నటించిన సినిమా వాయిదాలు పడుతూ వెళ్తోంది.ఇప్పటికే దర్శకుడు తేజా( Teja ) తన కెరీర్లు ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

అయితే అభిరామ్ విషయంలో తేజ కూడా ఏమీ చేయలేకపోతున్నట్టు సమాచారం.

Advertisement

గీతిక తివారి హీరోయిన్( Geetika tiwari ) గా అభిరామ్ సినిమాలో నటిస్తుండగా ఈ చిత్రంలో సదా, రజత్ బేడి, కమల్ కామరాజు, బిందు చక్రవర్తి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అయితే అహింస సినిమాకు సంబంధించిన పోస్టర్లు పాటలు ఇప్పటికే విడుదల కాగా, అన్ని మంచి ఫలితాలను దక్కించుకున్నాయి.మొదట ఈ సినిమాను ఎప్పుడు ఏడవ తారీఖున విడుదల చేయాలని భావించిన బయటకు చెప్పలేని కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది.

ఈసారి మరో విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం వేసవి కానుకగా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా చెప్తున్నారు.

ఇక అహింసా సినిమాకు సంబంధించి విడుదల పోస్ట్ పోన్ అవ్వడానికి గల కారణాలు బయటకు స్పష్టంగా తెలియడం లేదు.ఓవైపు తేజా లాంటి దర్శకుడు మరోవైపు అభిరాం లాంటి హీరో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇలాంటి తరుణంలో విడుదల వాయిదా పట్టుతుండటం దగ్గుబాటి అభిమానులను కలవడానికి గురిచేస్తుంది.

ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం నుంచి రానా హీరోగా వచ్చి వరుస విజయాలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే కానీ లుక్స్ పరంగా నార్మల్ గా ఉన్న అభిరామ్ హీరోగా ఇండస్ట్రీలో నెగ్గగలడా లేదా అనే విషయం కాస్త వేచి చూస్తే కానీ తెలియదు.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు