సూర్యాపేట జిల్లా:సమ్మె పేరుతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ( JPS Strike ) విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( S Venkata Rao ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమ్మెలో కొనసాగడం చట్ట విరుద్ధమన్నారు.ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధులలో చేరేందుకు ఒక అవకాశం ఇచ్చిందని, వీధుల్లో చేరని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.