చిరంజీవి తన కెరీర్ మొత్తంలో ఇప్పటికీ 150 కి పైగా సినిమాల్లో నటించాడు.అయితే ఎన్ని సినిమాల్లో నటించిన అతనికి మెగాస్టార్( Megastar ) అనే బిరుదు రావడానికి కారణమైన సినిమా మాత్రం కేవలం గ్యాంగ్ లీడర్ అంటే అతిశయోక్తి కాదు.
ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా సునామీని సృష్టించింది.ఇక విజయశాంతితో చిరంజీవి చేసిన రొమాన్స్ పాటలు కూడా బ్రహ్మాండమైన విజయం దక్కించుకున్నాయి.
కేవలం పాటల కోసమే ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీమళ్లీ అప్పట్లో చూశారంటే అది ఎంతటి విజయాన్ని దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.అయితే మొదట గ్యాంగ్ లీడర్ సినిమా( Gang Leader )కి చిరంజీవి నో అని చెప్పాడట.
మరి చెయ్యను అన్న సినిమాలు ఎలా చేశాడు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించింది విజయబాపినీడు.ఈ సినిమా కన్న ముందు పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి కొన్ని చిరు చిత్రాలకు విజయబాపినీడు దర్శకత్వ వహించారు.ఏదైనా ఒక సరికొత్త కథతో చిరంజీవికి మంచి విజయాన్ని అందించాలని తలచిన విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ కథను చాలా కష్టం మీద సిద్ధం చేసుకుని వెళ్లి ఆయనకు వినిపించారట.
కానీ కథ విన తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమా ఆడదు నేను చెయ్యను అంటూ చెప్పేశారట.దాంతో తీవ్ర నిరాశకు లోనైనా విజయబాపినీడు సరాసరి పరుచూరి బ్రదర్స్( Paruchuri Brothers ) కి దగ్గరకు వెళ్లి ఆ కథను వినిపించాడట.
దాంతో కథ మొత్తం విన్నపరుచూరి దాంట్లో కొన్ని లోపాలు గమనించి వాటిని సరి చేయడానికి మూడు రోజుల టైం అడిగారట ఆ విషయాన్ని చిరంజీవి( Chiranjeevi )కి చెప్పగానే మరుచూరి బ్రదర్స్ పై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పారట అలా కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి వినిపించాక ఆయన ఓకే చేసి అల్లు అరవింద్( Allu Arjun ) కి డేట్స్ విషయం చూసుకోమని అప్ప చెప్పారట.అల్లు అరవింద్ సైతం పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) చేత కథ ఒకసారి చెప్పించుకుని రికార్డు చేసుకుని మరీ విన్నారట.ఎందుకు అలా చేశారు అంటే మీరు మాటలతో మాయాజాలం చేస్తారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి ఆ రికార్డు విని కథ ఎలా ఉందో చెప్తాను అని చెప్పారట.అలా మొదలైన ఆ సినిమా ఆ తర్వాత ఎంతటి విజయాన్ని దక్కించుకుందో మన అందరికీ తెలిసిందే.