మౌనమేలనోయి బాబు : వెళ్తున్నారు... విమర్శిస్తున్నారు !

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ.ఏపీలో పాలిటిక్స్ ఎవరూ ఊహించని రేంజ్ లో మారిపోతున్నాయి.

ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్ చేసే నాయకుల సంఖ్య రోజు రోజు కి పెరిగిపోతోంది.జాతీయ స్థాయి సంస్థలు చేపట్టిన సర్వేలో వైసీపీ ఏపీలో అధికారంలోకి రాబోతోంది అని తేలడంతో.

టీడీపీలో ఉన్న నాయకులు, ఎమ్యెల్యే , ఎంపీలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.మరో పక్క టీడీపీ గాలి పెరిగింది.ఇక ఫర్లేదు అధికారం మనదే అన్న ధీమా పెరిగిన సమయంలో నాయకులు జుంపింగ్ చేయడం టీడీపీ అగ్ర నాయకులకు మింగుడుపడడం లేదు.

నాయకుల జంపింగ్ పై ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండిపోతున్నారు.ఎందుకంటే పార్టీ మారిన నాయకులను ఏమైనా అందామా అంటే .ఏమీ అనలేని పరిస్థితి.

Advertisement

మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి.పార్టీ మారిన నాయకులమీద అవినీతి ఆరోపణలు చేద్దామా అంటే.ఇప్పటి వరకు తమ పార్టీలోనే ఉన్నారు.

చివర్లో పార్టీ మారుతున్నారు.పోని ఆకర్ష్ పథకం అందామా అంటే దానికి ఛాన్స్ లేకుండా పోయింది.

అధికార పార్టీ.విపక్ష పార్టీ నేతలకు గాలం వేయడాన్ని ఆకర్ష్ అనవచ్చు.

ఇక్కడా ఆ ఛాన్స్ కనిపించడం లేదు.మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తమ పార్టీ లో చేరే ఎమ్యెల్యే , ఎంపీలను ఆ పదవులకు రాజీనామా చేయించి మరి జగన్ పార్టీలో కి చేర్చుకోవడంతో .గట్టిగా విమర్శించలేని పరిస్థితి టీడీపీది.

Advertisement

గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్యెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీసాడు.దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా.వాటిని పట్టించుకోకుండా.

చంద్రబాబు సైలెంట్ గా ఉండిపోయాడు.ఆ ఫిరాయింపు ఎమ్యెల్యేలు కూడా తాము చంద్రబాబు అభివృద్ధిని చూసి వచ్చామని.

తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే.ఖచ్చితంగా.

అధికార పార్టీలోకి వెళ్లి తీరాల్సిందే అని ఓ సరికొత్త వాదన తెర మీదకు తీసుకువచ్చారు.ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్న నాయకులు చంద్రబాబు మీద భారీగా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.

వారికి కౌంటర్ ఇవ్వలేక .సైలెంట్ గా ఉండలేక సతమతం అవుతున్నారు టీడీపీ నాయకులు.

తాజా వార్తలు