తెలంగాణ రాష్ట్రం ( Telangana state ) లో ఎక్కడ చూసినా ఎన్నికల వేడి కనిపిస్తోంది.ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి.
ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ( BRS ) 115 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ప్రకటించి ప్రచార హోరులో మునిగిపోయింది.అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆసక్తికరమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ దుబ్బాక.
ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మరి రాబోవు ఎలక్షన్స్ లో అక్కడ మళ్లీ రఘునందన్ రావు గెలుస్తాడా లేదంటే.
ఇంకెవరైనా పోటీ చేసి గెలుస్తారా అనేది పూర్తి వివరాలు చూద్దాం.
దుబ్బాక ( Dubbaka ) లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చెరుకు ముత్యం రెడ్డి గెలుపొందారు.
ఆ తర్వాత 2014 2018లో జరిగిన ఎలక్షన్స్ లో ముత్యం రెడ్డిపై బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు.ఎమ్మెల్యే రామలింగారెడ్డి గుండెపోటుతో మధ్యలోనే మృతి చెందడంతో, అక్కడ 2020లో ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు.విపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నటువంటి రఘునందన్ రావు ( Raghunandan Rao ) కు సొంత పార్టీ నుంచి అంతగా సపోర్టు లేదు.
ఆ మధ్యకాలంలో రఘునందన్ రావు తనలోని ప్రస్టేషన్ కూడా బయటపెట్టారు.ఓవైపు పార్టీ సపోర్ట్ లేక మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఆయన సతమతమవుతున్నారు.
దుబ్బాకలో ఎలాంటి కార్యక్రమాలైనా మంత్రి హరీష్ రావు వెళ్లి డైరెక్ట్ గా చేయడంతో రఘునందన్ రావుకు హరీష్ రావు కొరకని కొయ్యగా మారారు.

ఇదిలా ఉండగా కమలం పార్టీ నుంచి రఘునందన్ రావుకి పోటీగా ఇప్పటికే చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.కట్ చేస్తే ఈసారి దుబ్బాక సెగ్మెంట్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kotta Prabhakar Reddy ) పోటీ చేస్తారని బిఆర్ఎస్ లిస్టులో ప్రకటించింది.దీంతో ఆయన దుబ్బాక లోనే ఉంటూ నియోజకవర్గం లోని నాయకులను కలుపుకుపోతూ ఎలాగైనా గెలవాలని అనేక కసరత్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ( Cheruku Srinivas reddy ) కూడా ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక ఈయనే కాకుండా కత్తి కార్తీక కూడా దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని గత కొంతకాలం నుంచి వెయిట్ చేస్తోంది.శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తనకే టికెట్ వస్తుందని ప్రచారం కూడా మొదలుపెట్టారు.తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను చూపిస్తూ తన ప్రచారహోరును కొనసాగిస్తూ వస్తున్నారు.
ఈ విధంగా దుబ్బాకలో బిజెపి( BJP ), కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఈసారి గట్టిపోటీ ఉంటుందని తెలుస్తోంది.మరి ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో, ఓటర్ మహాశయుల మనసులో ఎవరున్నారో ముందు ముందు తెలుస్తుంది.