తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణతో పాటు , మరో నాలుగు రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
అయినా దేశవ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపైనే అంతా దృష్టి సారించారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఇక్కడ గెలిచి దేశవ్యాప్తంగా తమకు తిరుగు లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి .వచ్చే లోకసభ ఎన్నికల్లోను తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపించబోతుండడంతో , ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.చాలా కాలంగా తెలంగాణపై అటు కాంగ్రెస్ , ఇటు బిజెపి అధిష్టానాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

రెండు పార్టీల అగ్ర నేతలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండే విధంగా అనేక వ్యూహాలు రచించారు.తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తోంది.తెలంగాణ ఇచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందింది. 2018 ఎన్నికల్లోను మరోసారి పరాభవం తప్పలేదు .ఈసారి తప్పకుండా తామే గెలుస్తామనే ధీమా లో కాంగ్రెస్ ఉంది .ఇక బిజెపి కూడా ఇక్కడ గెలిచి, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తెలంగాణ నుంచి సాధించాలనే పట్టుదల తో ఉంది .ఇక బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) గెలుపు పై ఆశలు పెట్టుకున్నారు.ఖచ్చితంగా తామే గెలుస్తామని గంభీరంగా ప్రకటనలు చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ను ఆయన కొట్టి పారేస్తున్నారు.

ఖచ్చితంగా బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు .ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అటు కాంగ్రెస్, బిజెపికి( Congress, BJP ) చెందిన ఇతర రాష్ట్రాల నాయకులు అనేకమంది ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దీంతో ఆయా రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది .ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని , కాంగ్రెస్ నేతలతో పాటు , కర్ణాటక కాంగ్రెస్ నేతల్లోనూ నెలకొంద ఇప్పటికే ఆ పార్టీ తరఫున కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు.ఇక కేంద్ర హోం మంత్రి, బిజెపి అగ్ర నేతగా ఉన్న తెలంగాణ బిజెపి నాయకులతో టచ్ లో ఉంటూ, ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో హాంగ్ ఏర్పడుతుందని బిజెపి అంచనా ఉంది ఒకవేళ అదే జరిగితే తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని, రాష్ట్రపతి పాలన తెలంగాణలో వస్తుందని బిజెపి అగ్ర నాయకులు చెబుతున్నారట.