యువ సినిమాలో సూర్య పాత్రకి మొదట అనుకున్న హీరో ఎవరంటే..?

మణిరత్నం సినిమాలు అంటే అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉండేది ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక రికార్డు ని క్రియేట్ చేసేది అలా ఆయన చాలామంది పెద్ద హెరోలతో చాలా మంచి సినిమాలు తీసాడు.మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ని పెట్టి ఇద్దరు అనే సినిమా తీసాడు.

 Who Was The First Hero Thought For The Role Of Surya In Yuva Movie, Mahesh Babu-TeluguStop.com

అలాగే రజిని కాంత్ మమ్ముట్టి ని పెట్టి దళపతి అనే సినిమా తీసి అటు తమిళ్ లోను ఇటు తెలుగు లోను మంచి సక్సెస్ అందుకున్నాడు.అయితే ఆయన చేసిన సినిమాల్లో యువ సినిమా మంచి విజయాన్నిఅందుకుంది ఈ సినిమాతోనే సిద్దార్థ్, త్రిష ఇద్దరు కూడా స్క్రీన్ మీద కనపడి సందడి చేసారు అలాగే ఈ సినిమాలో మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు.

ఇక హీరో సూర్య కూడా స్టూడెంట్ లీడర్ గా నటించి తన నటనతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసాడు.

 Who Was The First Hero Thought For The Role Of Surya In Yuva Movie, Mahesh Babu-TeluguStop.com
Telugu Madhavan, Mahesh Babu, Mani Ratnam, Ponniyan Selvan, Siddharth, Surya, Ta

అయితే ఈ సినిమా లో సూర్య పోషించిన పాత్ర కోసం మొదటగా మణిరత్నం గారు మహేష్ బాబు ని అడిగారట కానీ ఆయన అప్పటికే ఒక 3 సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాకా సినిమా చేయలేదట దాంతో హీరో సూర్య తో మణిరత్నం ఈ క్యారెక్టర్ చేయించారు నిజానికి ఈ క్యారెక్టర్ సూర్య అద్భుతంగా చేసాడు.అయితే మణిరత్నం మహేష్ బాబు ని ఎందుకు తీసుకుందాం అనుకున్నారట అంటే మహేష్ అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు.కాబట్టి ఆ క్యారెక్టర్ కి మహేష్ బాబు అయితే బాగా సెట్ అవుతాడు అని అనుకున్నాడట కానీ చివరికి ఈ పాత్ర సూర్య చేసాడు ఈ సినిమా తెలుగు, తమిళ్ లో మంచి విజయం సాధించింది.

Telugu Madhavan, Mahesh Babu, Mani Ratnam, Ponniyan Selvan, Siddharth, Surya, Ta

ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తీసే పనిలో బిజీగా ఉన్నారు.ఇప్పటికే రిలీజ్ అయినా పొన్నియన్ సెల్వన్ తమిళం లో మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమా కూడా తమిళ్ లో మంచి విజయం సాదిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మణిరత్నం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube