తారక రత్న ఇలా అవ్వడానికి కుటుంబమే కారణమా ?

మంచి వారిని దేవుడు ఎప్పుడు త్వరగా తన దగ్గరకు తీసుకెళ్ళి పోతాడు.అందుకే తన.

 Who Is The Reason For Nandamuri Tarakaratna Situations Details, Nandamuri Taraka-TeluguStop.com

కుటుంబం మొత్తానికి బిన్నమైన వ్యక్తి గా పేరున్న తారక రత్న అతి చిన్న వయసులోనే ప్రాణాలు విడిచాడు.నిజంగా అంత త్వరగా చనిపోవల్సిన వ్యక్తి కాదు.

అప్పుడే ఎందుకు ఇలా జరిగింది అని అందరూ మదన పడుతున్నారు.అతడిని ఎలాంటి వేదన కలచి వేసిందో, ఏం పీల్చి వేసిందో కానీ ఎప్పుడు నవ్వుతూనే అందరినీ పలకరించే వాడు.

నలభై కూడా నిండక ముందే వెళ్ళిపోయాడు.మొదటి నుంచి తారక రత్న భార్యను నందమూరి కుటుంబం ఆదరించ లేదు.

ఇప్పుడు ఒక పాప కూడా ఉంది.ఇక వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న అందరిలో మొదలయ్యింది.

Telugu Alekhya Reddy, Amaravati, Ntr, Kalyan Ram, Nandamuri, Tarakaratna, Tollyw

ఏది ఏమైనా తారక రత్న విషయం లో అటు కుటుంబం, ఇటు కెరీర్ విషయంలో బయట ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాము.తారక రత్న కెరీర్ విషయానికి వెళ్తే ఒక వైపు కళ్యాణ్ రామ్, మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ లు తన కన్న వయసులో చిన్న వారైనప్పటికి దూసుకు పోతున్నారు.కానీ తన కెరీర్ మాత్రం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే ఉంది.ఇక ఎవరు కాదన్న అవునన్నా తారక రత్న ను జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ గానే హీరోను చేశారు.

కుటుంబం అంతా శాయ శక్తుల ప్రయత్నించి ఓకే రోజు 9 సినిమాలు ప్రారంభించే విధంగా జాగ్రత్త తీసుకున్నారు.ఇలా ఈ హీరో విషయంలోనూ జరగలేదు.ఇక పై జరగదు.

Telugu Alekhya Reddy, Amaravati, Ntr, Kalyan Ram, Nandamuri, Tarakaratna, Tollyw

9 సినిమాలు ఒకే రోజు ప్రారంభం కావడానికి నందమూరి కుటుంబం తమ పలుకుబడి మొత్తం ఉపయోగించింది.కానీ అందులో రెండో లేదా మూడో విడుదల అయ్యాయి.ఇక విలన్ గా కూడా సత్తా చాటలనుకున్న అది కూడా కుదరలేదు.ఒక్క అమరావతి సినిమాలో నటించినందుకు మాత్రం నంది అవార్డు దక్కించుకున్నాడు.20 ఏళ్లలో చేసింది 22 సినిమాలే.అందుకే చాలా ఏళ్ళు డిప్రెషన్ లో ఉండి పోయాడు.కానీ అది ఎవరి పైన చూపించలేదు.అలాగే రాజకీయాల్లో అయిన బిజీ అవ్వాలని అనుకున్నాడు.అందుకు అంతా సిద్ధం చేసుకుంటున్న కూడా కుప్పం లో లోకేష్ పాదయాత్ర కోసం వెళ్లి అక్కడే కుప్ప కూలి పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube