తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు( Balayya Babu ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక నటసింహంగా కూడా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మరుస సినిమా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉండడంతో తను ఎక్కడ కూడా విశ్రాంతిని తీసుకోకుండా వరుస సినిమాలను చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఒకప్పుడు చేసిన వీరభద్ర సినిమా( Veerabhadra Movie ) భారీ ప్లాప్ అయింది.

అయితే మొదట బాలయ్య ఈ సినిమాను చేయకూడదని అనుకున్నాడట.కానీ తన ఫ్రెండ్స్ కొంతమంది ఆ కథ ను విని కథ నీకు బాగా సెట్ అవుతుందని చెప్పడంతో ఆ సినిమాను చేసినట్టుగా ఆయన అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసారు.ఇక మొత్తానికైతే అది ప్లాప్ గా మారింది.
ఈ సినిమా డైరెక్టర్ అయిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి( AS Ravikumar Chowdary ) ఈ సినిమాని సరిగ్గా టేకఫ్ చేయకపోవడంతోనే ఈ సినిమా పోయిందని చాలా మంది సినీ విమర్శకులు సైతం ఈ సినిమా మీద విమర్శలు అయితే చేశారు.

ఇక అంతకు ముందు కూడా బాలయ్య బాబు ఫ్లాప్ లతో సతమతమవుతూ ఉండేవాడు.ఇక ఇలాంటి క్రమం లోనే బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సింహా సినిమాతో మరోసారి బాలయ్య బాబుకి బ్రేక్ రావడం తో ఆయన ఎక్కడ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ మీదున్న బాలయ్య ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడ ఆసక్తికరంగా మారుతుంది…
.







