ఆది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ కు తిరుగులేని హిట్ ఇచ్చిన సినిమా.2002 మార్చి 28న విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.ఆ రోజుల్లో ఈ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసింది.98 సెంటర్లలో 100 రోజుల పాటు ఆడింది.ఈ సినిమాతోనే వివి వినాయక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
అప్పటికే ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశాడు వినాయక్.ఆదితో దర్శకుడిగా మారి చక్కటి హిట్ అందుకున్నాడు.
అప్పటి వరకు ఈవీవీ సత్యనారాయణ, సాగర్, క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు.ఈ నేపథ్యంలోనే తను కూడా దర్శకుడు కావాలి అనుకుని కథ రెడీ చేసుకున్నాడు.
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బ్యానర్ లో ఓ సినిమా తీయాలి అనుకున్నాడు.అయితే నిజానికి ఆది సినిమాను బాలయ్యతో తియ్యాలి అనుకున్నాడట.
తొలుత వివి వినాయక్ తయారు చేసుకున్న కథలో ఇద్దరు బాలయ్యలు ఉంటారు.అందులో బాలయ్య తమ్ముడు చిన్నప్పుడు విలన్ పై బాంబులు వేస్తాడు.
ఆ తర్వాత పెద్ద బాలయ్య పోలీస్ అయ్యాక తన తమ్ముడిని కూడా కొట్టాల్సి వస్తుంది.ఆ కథలో టాటా సుమోలు గాల్లోకి ఎగురుతాయి.
ఈ సన్నివేశాలతో ముందుగా బాలయ్య కోసం వినాయక్ కథ రాసుకున్నాడట.అనుకోకుండా ఈ సినిమా ఎన్టీఆర్ తో చేయాల్సి వచ్చిందట.
తాను బాలయ్య కోసం రాసుకున్న కథలోనే మార్పులు చేసుకుని ఆది సినిమా చేశాడట.

అలా.బాలయ్యతో చేయాల్సిన సినిమాలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు.మణి శర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
అన్ని పాటలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి.ఈ సినిమాలో కీర్తి చావ్లా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేసింది.
అయితే తన తొలి సినిమా బాలయ్యతో అనుకున్నా చేయలేని వినాయక్.రెండో సినిమాను మాత్రం తనతోనే తీశాడు.
బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా చేసి అద్భుత విజయాన్ని అందుకున్నాడు.