Allu Arjun : అల్లు అర్జున్ డాన్స్ చూసి వంద రూపాయలు ఇచ్చిన డైరెక్టర్..ఎవరంటే..?

అల్లు అర్జున్ ( Allu Arjun ) కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడంతో అందరు చూపు ప్రస్తుతం అల్లు అర్జున్ మీదే ఉంది.మొట్టమొదటి సారి ఉత్తమ నటుడిగా టాలీవుడ్ నుండి అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.

ఇప్పటివరకు ఏ హీరో కూడా ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకోలేదట.కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప ( Pushpa ) సినిమాలోని ఆయన నటనకి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో అందరూ మెచ్చుకుంటున్నారు.ఇంట్లో వాళ్ళు,సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ ఆయనను పొగుడుతున్నారు.

ఇక అవార్డు రావడంతోనే బన్నీ కళ్ళలో కన్నీళ్లు కూడా వచ్చాయి.ఇదంతా పక్కన పెడితే.గతంలో అల్లు అర్జున్ డాన్స్ చూసి ఓ స్టార్ డైరెక్టర్ 100 రూపాయలు ఇచ్చారట.

మరి ఆ డైరెక్టర్ ఎవరు.ఎందుకు ఆయన డాన్స్ కి వంద రూపాయలు ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చిరంజీవి ( Chiranjeevi ) పుట్టినరోజు వేడుకలు చాలా వరకు అభిమాన సమక్షంలోనే జరుగుతాయి.అయితే అల్లు అర్జున్ చిన్నతనంలో కూడా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా అభిమానుల సమక్షంలో చేసుకుంటున్న వేళ అందరూ డాన్స్ చేస్తున్నారు.

ఇక ఇందులో అల్లు అర్జున్ కూడా తనదైన డాన్స్ తో అందరినీ మెప్పించారు.అయితే అక్కడే ఉన్న రాఘవేంద్రరావు ( Raghavendra rao ) అల్లు అర్జున్ డాన్స్ కి ఫిదా అయ్యాడు.

దాంతో అల్లు నిర్మల అంటే అల్లు అర్జున్ తల్లి దగ్గరికి వెళ్లి మీ కొడుకు చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు.వంద రూపాయలు తీసుకోండి అని ఇచ్చారట.

అంతేకాదు వీడు పెద్దయ్యాక వీడితో మొదటి సినిమా నేనే తీస్తాను అని కూడా అల్లు నిర్మల ( Allu Nirmala ) కి మాట ఇచ్చారట.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఇక రాఘవేందర్రావు మాట ఇచ్చిందాని ప్రకారమే అల్లు అర్జున్ పెద్దయ్యాక ఆయన మొదటి సినిమా గంగోత్రి ( Gangothri ) కి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమా టైంలో అల్లు అర్జున్ ఫేస్ చూసి చాలా మంది ట్రోల్స్ చేశారు.ఆయన లుక్స్ చూసి, ఆయన కటౌట్ చూసి అందరూ వీడెం హీరో అవుతాడు అంటూ హేళన చేశారు.

Advertisement

కానీ అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఉత్తమ నటుడిగా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడం చాలా గర్వకారణం అంటూ ఆయన అభిమానులు ఓ రేంజ్ లో అల్లు అర్జున్ ని పొగుడుతున్నారు.

తాజా వార్తలు