ఎంతపని చేశారు ? ఎవరు వారు ? ఆ వెన్నుపోటు వీరులు ?

చేయాల్సిందంతా చేశాం, చెప్పాల్సిందంతా చెప్పాం, అయినా ఎక్కడో తేడా కొట్టింది.

మెజార్టీ మీద లెక్కలు వేసుకోవాల్సిన మనం అసలు గెలుస్తామా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది.

ఇలా జరగడానికి కారణం ఏంటి ? పోనీ పార్టీ తరపున ఏమైనా లోపాలు చేశామా అంటే అదీ లేదు.ఒక ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చుపెట్టాం కదా ! ప్రత్యర్థుల మీద, ప్రత్యర్థి పార్టీల మీద సామ బేధ దండోపాయాలన్నీ ప్రయోగించాం.

ఆ లెక్కప్రకారం చూసినా మనం గెలవాల్సి ఉంది.మెజార్టీ సీట్లు సాధించాల్సి ఉంది.అయినా మనం వెనకబడిపోయినట్టు అనేక సర్వేలు తేల్చేశాయి.

దీనంతటికి కారణం బయటివారు ఎవరూ కాదు.ఖచ్చితంగా మన పార్టీ వారే దెబ్బకొట్టారు.

Advertisement

ఆ వెన్నుపోటు వీరులెవరో తేలాలి.ఎవరిని ఊరికే వదిలిపెట్టం అంటూ పదే పదే డైలాగులు టీడీపీ లో వినిపిస్తున్నాయి.

టీడీపీలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులు కలవరపెట్టేస్తున్నాయి.వెన్నుపోటు వీరుల కారణంగా జరిగిన డ్యామేజ్ ఎంత ?ఈ లెక్కల్లో ప్రస్తుతం అన్ని పార్టీల్లోని అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు.కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరు పక్కనే ఉంటూ ద్రోహం చేశారనే లెక్కలు ఆరా తీస్తూ పార్టీ అధిష్టానానికి నివేదికలు పంపిస్తున్నారు.

అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అని మరికొందరు ఈ పరిణామాలపై విశ్లేషిస్తున్నారు.డబ్బు చుట్టూ రాజకీయం అనే ప్రస్తుత రోజుల్లో విలువలు, విశ్వసనీయత అంటూ లెక్కలు వేసుకుంటే ప్రయోజనం ఏంటి అనే వాదన తెరపైకి తెస్తున్నారు.

పోలింగ్ ముగిశాకా వస్తున్న రిపోర్ట్ లతో నీడను సైతం అభ్యర్థులు అనుమానిస్తున్నారు.పక్కనే ఉంటూ, పార్టీ కోసం, తమ గెలుపుకోసం కష్టపడిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి బాగా దెబ్బకొట్టేశారని, ఆ వెన్నుపోటు నుంచి ఎంతవరకు తప్పించుకుంటాం ? అంటూ టీడీపీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో పాటు ఓటర్లకు పంచిపెట్టిన సొమ్ములు కింది స్థాయి వరకు ఎంత శాతం చేరి ఉంటుంది అనే ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

కొంతమంది నాయకులు దొరికిందే సందు అన్నట్టుగా పంచడానికి ఇచ్చిన సొమ్ములో కొంతభాగాన్ని దాచిపెట్టుకున్నారని, మరికొంతమంది తమ పార్టీ డబ్బులు పంచుతూ ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేసినట్టు కూడా రిపోర్ట్స్ అందడం అభ్యర్థుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు