ఎవరయ్యా నువ్వు.. ఇంత టాలెంట్‌గా ఉన్నావు.. జేసీబీతో అద్భుతం..

ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.ఇక కొందరికి చాలా అరుదైన టాలెంట్ ఉంటుంది.

 Who Are You You Are So Talented Amazing With Jcb , Viral News, Viral Video, Jcb-TeluguStop.com

వారు ఆ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.వీరికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోను @TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

షేర్ చేసిన కొద్ది సమయంలోనే దీనికి 30 లక్షలు దాకా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, ఒక మట్టి నేలపై ప్లాస్టిక్ బాటిల్స్ ( Plastic bottles )ను వరుసగా పేర్చడం చూడవచ్చు.వాటిని చాలా నైపుణ్యంతో టచ్ చేస్తూ జేసీబీ బకెట్లో బాటిల్స్‌ను డ్రైవర్ పడేయడం చూడవచ్చు.సాధారణంగా కాలుతో బాటిల్ చివర తొక్కితే అది పైకి లేస్తుంది.

అలా జేసీబీతో బాటిల్ ( Bottled with JCB )చివర నొక్కుతూ వాటిని బకెట్లో వేసుకుంటున్నాడు ఆపరేటర్.నిజానికి ఇది ఆ ఒక్క ఆపరేటర్ కి తప్ప మిగతా వారికి సాధ్యం కాదేమో అనిపించింది.

అసలు అంత పెద్ద వాహనంతో ఇలాంటి ట్రిక్ ప్రయోగించే ఆలోచన ఎవరికీ రాదు.కానీ ఆపరేటర్ కి వచ్చింది.

వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా అరుదైన నైపుణ్యం అని కామెంట్లు చేస్తున్నారు.అతడికి ఒక హానరరీ డిగ్రీ ఇవ్వాలంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.ఇలా ఆడుకుంటూ టైమ్‌ వేస్ట్ చేయడం వల్లే రోడ్లు ఎప్పటికీ కంప్లీట్ అవ్వడం లేదని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.“దీనిని చేతులతోనే చేయలేం, అలాంటిది జేసీబీ బకెట్‌తో ఈ వాటర్ బాటిల్స్ ను పిక్ అప్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంద”ని ఒకరు కామెంట్ చేశారు.ఈ బాటిల్స్‌ను వరుసగా పేర్చిన వ్యక్తి టాలెంట్‌ను కూడా కొందరు పొగిడారు.ఈ అరుదైన టాలెంట్ చూసేందుకు వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube