మెగా స్టార్స్ నుంచి బర్నింగ్ స్టార్ వరకు హీరోలు ఉన్నారు కానీ నటులు ఉన్నారా ?

హీరోయిజం …. ఈ పేరు పైన ఎన్ని పుస్తకాలు రాసిన కూడా ఇంకా రాయాల్సిన చాప్టర్లు మిగిలే ఉంటాయి.

 Who Are The Real Actors In Tollywood Details, Actors , Heroes, Tollywood, Megast-TeluguStop.com

ఎందుకంటే ఆ ఇజాన్ని నెత్తికెక్కించుకొని హీరోలు అంతా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.కానీ నటులుగా చచ్చిపోతున్నారు.

వాస్తవానికి మన ఇండస్ట్రీలో సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, రెబల్ స్టార్లు, పవర్ స్టార్లు బర్నింగ్ స్టార్ల దాకా చాలామంది స్టార్లు ఉన్నారు కానీ నటుడు ఎవరు అనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం దొరకదు.నటుడు వేరు హీరో వేరు అని ఎలా చెప్పగలం అనుకుంటున్నారా ? ఖచ్చితంగా హీరోలు చాలా మంది ఉన్నారు కానీ నటులు లేరు.హీరో కేవలం డిశుం డిశుం ఫైట్లు, ఒక్క బుల్లెట్ తో వంద మందిని చంపేయడం లేదా అసలు అర్థాలు లేని పాటలు, వెకిలి చేష్టలేకె పరిమితం అయ్యాడు.

Telugu Actors, Stars, Chiranjeevi, Heros, Kamal Haasan, Megas, Mohan Laal, Pawan

ఇక హీరో వస్తున్నాడు అంటే భజన కీర్తనలు, వంశ కీర్తనలు మరో మెట్టు.హీరోని బాగా పొగిడేస్తూ మీ అభిమానులు ఇలాగే కోరుకుంటున్నారు అంటూ నటుడిని చంపేయడం జరుగుతుంది.కేవలం నాలుగు పాటలు, హీరోయిన్ తో స్టెప్పులు వేస్తే ,ఫైట్లు చేస్తే హీరో అవుతారు కానీ నటుడు ఎందుకు అవుతారు, నటుడు కావాలి అంటే తనలోని హీరోయిజం చచ్చిపోవాలి.

మరి మన తెలుగులో ఎంతమంది నటులు ఉన్నారు అంటే అభిలాష శుభలేఖ టైంలో చిరంజీవి అనే ఒక మంచి నటుడు ఉన్నాడు కానీ ఆ తర్వాత డబ్బులు రాక, కమర్షియల్ ఫార్ములా కోసం తనలోని నటుడిని చంపేసి కేవలం హీరో గానే మిగిలించారు.

Telugu Actors, Stars, Chiranjeevi, Heros, Kamal Haasan, Megas, Mohan Laal, Pawan

మంచి పాత్ర దొరికితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ లాంటి స్టార్ అంతా కూడా నటులుగా జీవిస్తారు.కానీ అలా జీవించకుండా తెలుగు అభిమానులు లేదా దర్శకులు అందరూ కలిసి వారిని హీరోలుగా చేసి నటులుగా కూలీ చేస్తున్నారు.మిగతా భాషల్లో తీసుకుంటే మలయాళం లో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటివారు ఎప్పటికీ నటులు మాత్రమే.

వారి దగ్గర ఎలాంటి ఆడంబరాలు ఉండవు.ఇక తమిళ్లో విక్రమ్, కమల్ అద్భుతమైన నటులు ఎలాంటి పాత్రైనా నటన కోసమే చేస్తారు.

సూర్య కూడా మంచి నటుడు జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలు చూశాక అతడిని నటుడుగానే గుర్తిస్తున్నారు.ఇక కన్నడ విషయాన్ని వస్తే రిషబ్ ఖచ్చితంగా మంచి నటుడు.

రక్షిత్ శెట్టి కూడా మంచి నటుడు.యష్ ని మళ్లీ ఈ కేటగిరిలో తీసుకోలేము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube