ఎలాన్‌ మస్క్‌కి ఊహించని ఝలక్కిచ్చిన వైట్ హౌస్!

నిజమే, ట్విటర్ ( Twitter ) ప్రస్తుత అధినేత ఎలాన్‌ మస్క్‌కు( Elon Musk ) అమెరికా వైట్‌హౌస్ షాక్ ఇచ్చింది.

ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు డబ్బులు చెల్లించకూడదంటూ వైట్‌హౌస్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వైట్ హౌస్( White House ) సిబ్బంది అధికారిక ట్విటర్ ప్రొఫైల్స్‌ని వెరిఫైడ్ అకౌంట్స్‌గా కొనసాగించేందుకు వైట్‌హౌస్ రుసుం చెల్లించేందుకు ఇపుడు ఒప్పుకోవడం లేదు.ఈ మేరకు వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ తమ సిబ్బందికి ఓ ఈమెయిల్ పంపినట్లు సమాచారం.

ఇకపోతే ట్విటర్‌ను టేకోవర్ చేసిన వెంటనే మస్క్ పెయిడ్ సర్వీసులను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఆర్గనైజేషన్లకు ఎప్పటినుంచో ఉంటూ వస్తున్న బ్లూ టిక్‌లను శనివారం నుంచి తొలగిస్తునట్లు ట్విటర్ వెల్లడించిన నేపథ్యంలో వైట్‌హౌస్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.వైట్ హౌస్ సిబ్బందికి డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ రాబ్ ఫ్లాహర్టీ ఈమెయిల్ పంపించగా స్టాఫర్స్‌కి గైడెన్స్‌ని వివరించినట్లు సమాచారం.కేవలం పెయిడ్ యూజర్‌గా గుర్తించేందుకు మాత్రమే ఈ వెరిఫికేషన్ సర్వీస్‌ని ట్విటర్ అందిస్తోందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈమెయిల్‌లో స్టాఫర్స్‌ని రాబ్ కోరడం జరిగింది.

Advertisement

ఈ సందర్భంగా ఒక వ్యక్తి అథారిటీని గుర్తించేందుకు వెరిఫికేషన్‌ని ఒక సర్వీసుగా సమకూర్చట్లేదని సిబ్బందికి డైరెక్టర్ సూచించారు.ట్విటర్ సవరించిన కొత్త పాలసీ నిబంధనలను వైట్‌హౌస్‌కు అనుగుణంగా లేవని మెయిల్‌లో స్పష్టం చేసారు.ఫలితంగా సిబ్బంది అకౌంట్‌లకు వెరిఫికేషన్ కొనసాగింపుపై వైట్‌హౌస్ గ్యారంటీ ఇవ్వబోదని ఫ్లాహర్టీ నిక్కచ్చిగా చెప్పారు.

వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ పంపించిన మార్గదర్శకాలు అన్ని ప్రభుత్వ విభాగాలకు అమలు అవుతాయనే నిబంధన ఏమీ లేదు.అయితే, కొన్ని ఏజెన్సీలకు, ప్రభుత్వ విభాగాలకు షరతులతో కూడిన మార్గదర్శకాలను డైరెక్టర్ పంపించే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు