మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక పాము ఏడాదిన్నర వయసున్న పాపకు తల్లిని దూరం చేసింది.
హృదయాన్ని కరిగించేలా ఉన్న ఈ ఘటన తాలూకూ విషయం తెలుసుకుంటే.మహారాష్ట్రలోని, చంద్రాపూర్ మండలం, సోనాపూర్ నుంచి కొందరు కూలీలు ఉపాది నిమిత్తం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు.
వీరంతా గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటు మిరప కోతలకు వెళుతున్నారట.ఈ క్రమంలో ఆ గుడారంలో మంగళవారం రాత్రి ఆదమరచి నిద్రపోతున్న వేళ తన బిడ్ద ఏడ్వడంతో మెలకువ వచ్చిన ఆ తల్లి తన పసిది ఆకలికి ఏడుస్తుందని భావించి బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించిందట.
అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ పాము తల్లి శ్రుతి రొమ్ముపై కాటేసిందట.దీంతో తన బిడ్దను కూడా ఆ పాము పొట్టన పెట్టుకుంటుందని భావించిన ఆ తల్లి తన గురించి భయపడకుండా ఆ పామును చేతితో పట్టుకుని ఓ వైపు విసిరేసిందట.
ఆ చీకట్లో రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై పడి ఆ పాము అతడినీ కూడా కాటేసిందట.ఇక ఆ తల్లి అరపులకు మెలకువ వచ్చిన మిగతా వారు వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రుతి మరణించిందట.
కాగా ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy