కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తున్న దేశాలు ఏంటంటే.. ?

కష్టమో నష్టమో భరిస్తూ, రెక్కాడితే గానీ డొక్కాడని పేదల బ్రతుకులని చీల్చి చెండాడిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ మిగిల్చిన జ్ఞాపకాల నుండి ఇప్పుడిప్పుడే భారత దేశం కోలుకుంటుంది.కానీ దీని ధాటికి ప్రపంచ దేశాల్లో భారతీయులకు అనుమతి నిరాకరించబడిన సంగతి తెలిసిందే.

 Which Countries Allow Indian Travelers After Corona Second Wave, Indian Traveler-TeluguStop.com

అదీగాక తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేశాయి.

కానీ ఇండియాలో పరిస్దితులు అదుపులోకి రావడంతో భారత ప్రయాణికులకు రష్యా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్టు వంటి అనేక దేశాలు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నాయట.

ఇక ఈ కరోనా వల్ల విదేశాల్లోని పర్యాటకరంగం బోసిపోయింది. విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి.ఇప్పుడిప్పుడే పర్యాటక రంగంపై దృష్టి మళ్ళీస్తున్న దేశాలు షరుతులతో కూడిన అనుమతులను ఇస్తున్నాయి.తప్పని సరిగ్గా కోవిడ్ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ అనే రిపోర్ట్ ఉండాలని వెల్లడిస్తున్నాయి.

అదీకూడా తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నవి అయితేనే మంచిదని, తమ దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రయాణికులు 14 రోజులపాటు క్వారెంటైన్ తప్పనిసరని పేర్కొంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube