దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాల తీరుతో ప్రజలు విసిగిపోతున్నారని, అందితే కాళ్లూ లేకుంటే జుట్టు పట్టుకుంటున్నాయని, పేద ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఉచితం అంటూ ప్రజలను సోమరులుగా మారుస్తూ, ఆ ఉచితంగా పంచిన వాటి ధరలను పన్నుల రూపంలో పిండుకుంటున్నారని జనం వాపోతున్నారట.

ఇక మోదీ అధికారంలోకి వస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని దేస ప్రజలు భావించారట.కానీ ప్రజల రక్తాన్ని అధిక పన్నుల రూపంలో గుంజుతూ, సామాన్యులను పేదవారిగా మారుస్తూ, ధనవంతులకు దోచి పెడుతున్నాడనే అపవాదు మూటగట్టుకున్నారు.ఇదిలా ఉండగా ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి అవకాశం కలిగిస్తున్న కేంద్రం త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేసిందట.
కాగా సీఎన్‌బీసీ ఆవాజ్ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ప్రైవేటీకరించనున్నట్లుగా సమాచారం.