వార్వెవ్వా ఏం ఆలోచన.. సినిమాలతో వచ్చిన డబ్బును పవన్ ఏం చేశాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది.సినిమా విడుదలై ఇన్ని రోజులు అయినా.

జనాలు ఎగబడి చూస్తున్నారు.ఈ సినిమాతో పవన్ మరోసారి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.

ఈ సినిమాలో పవన్ స్థాయికి తగ్గకుండా క్యారెక్టర్ రూపకల్పన చేశాడు దర్శకుడు.ప్రస్తుతం భీమ్లా నాయక్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించి అడ్వాన్సులు కూడా అందుకున్నాడు.ఆడబ్బును భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని.

మంచి ఉపయోగకరమైన వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు.ఇంతకీ ఆయన ఎక్కడ పెట్టుబడులు పెట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి సినిమా పరిశ్రమ అనేది మ్యాజిక్ చేస్తుంటుంది.ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన సినిమాలు ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ తీస్తాయి.

వాటి మూలంగా చాలా మంది నిర్మాతలు ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద ఫ్యామిలీతో నిలబడ్డ సందర్భాలున్నాయి.ఎందరో నటులు, నటీమణులు, టెక్నీషియన్లు ఇలా ఇబ్బందులు పడ్డవారే.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

హీరో ఉదయ్ కిరణ్ అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్న సందర్బాలున్నాయి.అటు చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా పలు సినిమాలను నిర్మించి భారీ లాస్ రావడంతో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించినట్లు చెప్పాడు.

Advertisement

అందుకే సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు.సంపాదించిన డబ్బును భవిష్యత్ ను ఆలోచించి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.ఇప్పటికే పలువురు హీరోలు భూముల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ తాజాగా హైదరాబా శివారు ప్రాంతంలో 4 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు.తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన సినిమాల ద్వారా తీసుకున్న అడ్వాన్సులు భూముల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు.హైదరాబాద్ లో బాగా డెవలప్ అవుతున్న ఖ్వాజాగూడలోని అత్యంత విలువైన స్థలాన్ని రూ.20 కోట్లు పెట్టి కొన్నాడట.పిల్లల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లో ఒక ఇల్లు, ఫాంహౌస్ కట్టుకున్నాడు.ఇప్పుడు సంపాదించిన డబ్బులను కూడా ఆయన భూముల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.

తాజా వార్తలు