టీడీపీ క్యాడర్ దారెటు..? పూర్వ వైభవం కష్టమేనంటూ...!!

ఏపీలో టీడీపీ ఆగమ్యగోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో పార్టీ నేతల్లో నిస్తేజంలోకి వెళ్లారని తెలుస్తోంది.

నారా లోకేశ్ సైతం ఢిల్లీలో ఉండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని నడిపే సరైన వ్యక్తి లేడు.సీనియర్ నేతలు ఉన్న ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండగా క్యాడర్ అంతా నిస్తేజంలో కొట్టుకుపోతుంది.

టీడీపీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.అందుకే ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న కొందరు నేతలు సోయతప్పి కామెంట్స్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విశాఖ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ మహిళా మంత్రిపై ఈ తరహాలో దుర్భాషలు ఆడటం పార్టీ ఏ వైపు పయనిస్తోందో తెలియడం లేదు.

Advertisement

నాయకుల వ్యవహార శైలి ఇలా మారిందేమీ అనే సందేహాలు కలుగుతున్నాయి.పార్టీ పెద్ద దిక్కు చంద్రబాబు జైల్లో ఉండటం, యువనేత లోకేశ్ ఢిల్లీలో ఉండటమే ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తున్నాయి.

ఇతర సీనియర్ నేతలు యనమల, కేఈ కృష్ణమూర్తి వంటి వారు కూడా సైలెంట్ అయ్యారు.ఇక జిల్లాల్లోని క్యాడర్ సైతం గప్ చుప్ అయ్యారు.

పార్టీకి సరైన దిశానిర్దేశం లేక జాతరలో దారితప్పిన చిన్నపిల్లల మాదిరిగా మారింది.ఈ తరుణంలో చంద్రబాబుకు, భువనేశ్వరి, బ్రహ్మణి వంటివారి దృష్టిలో పడేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేయడానికి బండారు వంటివారు తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ వంటి సంస్కారవంతైన నాయకుడిని రోజా విమర్శిస్తూ మాట్లాడతారా అంటూ బండారు తమ నాయకుడు బాలయ్యను వెనకేసుకు రావడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు.ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో

కడుపైనా చేయాలి అని బహిరంగంగా మాట్లాడిన బాలయ్యను సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పడం ద్వారా బండారు తన గులాంగిరీ స్థాయిని బయటపెట్టకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎలాగైనా చంద్రబాబు కుటుంబం ఆశీస్సులు పొందాలన్న ఆతృతతో బండారు.

Advertisement

మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతూ తమ నోటి దురద తీర్చుకుంటున్నారని మండిపడుతున్నారు.పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మీదనే ఇలా రౌడీ భాషలో దాడులు చేస్తుంటే మామూలు మహిళలకు వీళ్ళు ఎలాంటి గౌరవం ఇస్తారు ? అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తోంది.ప్రస్తుత టీడీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

మహిళలకు కనీస గౌరవం ఇవ్వలేని ఇటువంటి నాయకుల చేతికి అధికారం వస్తే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏం అవుతుంది? అని యోచనలో పడ్డారట.అయితే ఇటువంటి నేతలతో పార్టీ నడవడం అంటే కష్టమేనంటున్నారు.

ఈ క్రమంలో టీడీపీకి రాష్ట్రంలో పూర్వ వైభవం వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తాజా వార్తలు