కొన్ని రోజుల కిందట అమెరికాలోని ఉటా ప్రాంతంలో 12 అడుగుల ఎత్తు గల ఒక సిల్వర్ స్తంభం అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా మాయం అయిపోయిన సంగతి అందరికీ విదితమే.ఆ తర్వాత రోమేనియాలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి పునరావృతం అయ్యింది.
అయితే ఆ ప్రాంతలలో ఎవరో కావాలనే ఆ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అప్పట్లో వాదనలు కూడా వినిపించాయి.ఆ సమయంలో ఈ రెండు సంఘటనలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
ఇక ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు ఎందుకని అనుకుంటున్నారా.? మళ్లీ అలాంటి సంఘటన ఇంకొకటి చోటుచేసుకోవడం జరిగింది.తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….ఊట, రోమేనియాలో ప్రత్యక్షమైన స్తంభాలు సిల్వర్ రంగులో ప్రత్యక్షమైతే శాన్ ఫ్రాన్సిస్కోలో జింజర్ బ్రెడ్ రంగులో స్తంభం అకస్మాత్తుగా ప్రత్యక్షం అయ్యింది.రాత్రికి రాత్రే శాన్ ఫ్రాన్సిస్కోలో కరోన హైట్స్ పార్క్‌లో జింజర్ బ్రెడ్ స్తంభాన్ని కనిపెట్టారు కొందరు పర్యాటకులు.
ఇందుకు సంబంధించిన వీడియోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ తరుణంలో ఆ పార్కు కు చెందిన ఉద్యానవన శాఖ అధికారులు స్పందిస్తూ.అక్కడ ఆ స్తంభాన్ని ఎందుకు పెట్టారో మాకు తెలియదని వారు పేర్కొన్నారు.అలాగే ప్రస్తుతం ఆ పార్కు నుంచి ఆ స్తంభాన్ని తొలగించే ఉద్దేశం లేదని వారు స్పష్టంగా తెలియజేశారు.
అలాగే కరోనా సృష్టించిన అల్లకల్లోలం తరుణంలో ఈ క్రిస్మస్ పండుగ వేళ ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుందని, అంతేకాకుండా ఆనందాన్ని అందజేస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ స్తంభం పొడవు 10 ఫీట్లు ఉంటుందని కొందరు అంటుంటే మరికొందరు అయితే 7, 5 ఫీట్లు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.