మంచు లక్ష్మి…( Manchu Lakshmi ) ఈమె నటుడు మంచు మోహన్ బాబు గారాలపట్టి.పుట్టింది ఇక్కడ అయినా కూడా చదువులన్నీ కాన్వెంట్ చదువులు కాబట్టి తింగర తింగరగా మాట్లాడడం ఈమెకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఇక చాలా ఏళ్ళు అమెరికాలో ఉంది కాబట్టి ఆమె స్లాంగ్ అంతా కూడా అక్కడి లాగే ఉంటుంది.
పైగా మోహన్ బాబు( Mohan Babu ) కూతురైన ఆమె తెలివి ఇండస్ట్రీలో లంచ్ కాలేదు.అమెరికాలోని ఇంగ్లీష్ భాషలోనే రెండు మూడు సినిమాల్లో నటించింది అలాగే కొన్ని టెలివిజన్ షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరించింది అక్కడ ఎంతో కొంత పేరు సంపాదించుకున్నాకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి మొదటి టీవీ ఇండస్ట్రీ ద్వారా తన తరంగేట్రం చేసుకుంది.
లక్ష్మీ టాక్ షో( Lakshmi Talk Show ) అంటూ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసి పేరు బాగానే సంపాదించుకుంది ఆ తర్వాత పలు షోలు చేసిన ఆమె అంతిమ లక్ష్యం సినిమాని అందుకే హీరోయిన్ గా కాకుండా విలన్ గా మొట్టమొదటిసారి పెద్ద తెరపై కనిపించింది.అనగనగా ఓ ధీరుడు( Anaganaga O Dheerudu ) సినిమా ద్వారా తన ఒక భయంకరమైన నటి అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో వరస పెట్టి ప్రాజెక్ట్స్ చేసింది కానీ ఎక్కడ సరైన బ్రేక్ ఆమెకు దొరకలేదు.మంచు లక్ష్మీ తెరపై కనిపించింది చివరలో పిట్ట కథలు( Pitta Kathalu ) అనే సినిమాలో 2021 తర్వాత ఆమె తెలుగు చిత్రంలోని నటించలేదు 2015లో దొంగాట సినిమా తర్వాత ఆమె నిర్మాతగా కూడా సినిమాలు తీయలేదు.
గత రెండు మూడేళ్లుగా ఆమె టెలివిజన్ షో కి కూడా హోస్ట్ గా రాలేదు దీంతో మంచు లక్ష్మికి ఏమైంది? అన్ని ఇండస్ట్రీలకు స్లోగా ఎందుకు దూరం అవుతోంది.ఆమెలో టాలెంట్ లేదా పోనీ ఆమె ఏ పాత్రకు సూట్ కావడం లేదా లేదంటే పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేయడం లేదా చిన్న సినిమాల్లో పెద్ద పాత్రలు చేయడం ఆమెకు నచ్చడం లేదా తాను ఏమి కోరుకుంటుంది అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా తలెత్తుతుంది.ఏదిఏమైనా ఆమె యూట్యూబ్ ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్ లోనే ఉంది తన కూతురికి సంబంధించిన లేదా తనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.కానీ కొత్త ప్రాజెక్ట్ మాత్రం ఆమె ఇప్పటి వరకు ఒప్పుకోవడం లేదు.