ఆచార్య కాపీ ఆరోపణలు చేసిన రచయితలు ఎక్కడున్నారో.. నోరు మెదపడం లేదుగా?

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ఇందులో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ పేరును మోసింది ఈ సినిమా.దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించే పలు చర్చలు జరుగుతూ ఉండగా.మరోవైపు ఈ సినిమా గురించి కాపీ ఆరోపణలు చేసిన రచయితల గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమా కథ తనదని.కొరటాల శివ ఈ కథను కాపీ కొట్టి ఇస్తున్నాడని దుమారం రేపాడు.

Advertisement

తను ఒక కథను రాసుకొని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారిని కలిశానని తెలిపాడు.ఇక వారికి కథ చెప్పగా.

వాళ్లు ఈ కథను కొరటాల శివ లాంటి పెద్ద దర్శకులు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారట.కానీ తాను మాత్రం కథను ఇవ్వనని అనడంతో.

తన కథనే కొరటాల కాపీ చేసి చిరంజీవితో సినిమా చేశాడు అని అన్నాడు.అంతేకాకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ లో ఒకరు కథలు రెండు ఒక్కటే అని అన్నాడని కూడా తెలిపాడు.

ఆ సమయంలో పెద్ద సినిమా కావటంతో కథను ఇప్పుడు బయట పెట్టలేనని.సినిమా విడుదల తర్వాత కథ వేరని ఆరోపణలు చేసిన వ్యక్తికే అర్థం అవుతుందని అన్నాడు.అయితే సినిమా విడుదల తర్వాత మళ్లీ ఈ సినిమా కాఫీ గురించి ఎటువంటి చర్చలు రాలేదు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

రాజేష్ కథను కాపీ కొట్టి నట్లయితే ఈ పాటికి రాజేష్ ఆ పాయింట్ తో మాట్లాడేవాడు.కానీ ఇప్పుడు ఇక్కడి నుండి ఎటువంటి స్పందన కూడా లేదు.

Advertisement

పైగా సినిమా ప్లాప్ కూడా కావడంతో రాజేష్ ఈ విషయం గురించి ఏమైనా స్పందిస్తాడేమో అని అనుకున్నారు.కానీ వారి నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు.

తాజా వార్తలు