పుష్ప 2 నుంచి యాక్షన్ టీజర్ ఎప్పుడు వస్తుంది అంటే..?

సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా వచ్చిన మూవీ పుష్ప( Pushpa ) ఈ సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ అయింది.అయితే ఇప్పుడు అందరూ పుష్ప 2 సినిమా కోసం చాలా ఇగార్ గా వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది…అందులో భాగంగా గానే అభిమానులు పుష్ప -2 నుంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు .

 When Will The Action Teaser From Pushpa 2 Come Out ,sukumar , Allu Arjun,pushpa-TeluguStop.com

పుష్ప ఘన విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 పై అంచనాలు భారీగా పెరిగాయి.పుష్ప రెండో భాగం ది రూల్ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే అప్‌డేట్ ఇవ్వమని గోల చేస్తున్నారు…

Telugu Allu Arjun, Bhanwarsingh, Pushpa, Sukumar-Movie

మొత్తానికి తాజాగా ఒక అప్‌డేట్ బయటికి వచ్చింది.చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఈ అప్‌డేట్ గురించి హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి .ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉండి .ఆ రోజు ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు .అందుకే, బన్నీ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని ఐకాన్ స్టార్‌తో పాటు దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నారని సమాచారం .అందుకే, ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణలో నుంచియాక్షన్ టీజర్‌ను సిద్ధం చేస్తున్నారని టాక్ .ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యిందని.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రస్తుతం జరుగుతోందని అంటున్నారు.

 When Will The Action Teaser From Pushpa 2 Come Out ,Sukumar , Allu Arjun,Pushpa-TeluguStop.com

ఈమధ్య సుకుమార్, బన్నీ చెన్నై వెళ్లడానికి కూడా కారణం ఇదేనని టాక్ … ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్.ఈ టీజర్‌కు నేపథ్య సంగీతం ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తుంది .

Telugu Allu Arjun, Bhanwarsingh, Pushpa, Sukumar-Movie

ఓ రేంజ్ యాక్షన్ షాట్స్‌తో ఉండే ఈ టీజర్ బన్నీ అభిమానులకు కన్నులపండువగా ఉంటుందని అంటున్నారు.అంతేకాదు, ఈ టీజర్‌తోనే పుష్ప 2 ప్రమోషన్స్మొదలైపోతాయని చెబుతున్నారు.బన్నీ పుట్టినరోజుకు ఇంకో మూడు వారాల సమయం కూడా లేదు .అందుకే త్వరలోనే టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు.మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌ తో పుష్ప పోటీపడనున్నాడు.

తొలి భాగంలోసాధారణ కూలీ నుంచి ఎర్రచందనం సిండికేట్‌ను శాషించే లీడర్‌గా ఎదిగిన పుష్ప.రెండో భాగంలో ఆ సిండికేట్‌ను ఎలా పాలిస్తాడో చూపించబోతున్నారు.ఈ క్రమంలో పుష్ప ఎదురైన ఒడిదుడుకులు, వాటిని అతడు అధిగమించిన తీరును సుకుమార్ ఆవిష్కరించనున్నారు.తొలి భాగం కంటే ‘పుష్ప 2’లో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోనున్నాయని టాక్….

చూడాలి మరి పుష్ప సినిమాలాగే పుష్ప 2 కూడా బంపర్ హిట్ కొడుతుందో లేదో…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube