బిగ్ బాస్ సీజన్ 7 లో భారీ మార్పులు...

తెలుగులో బుల్లితెర మీద షో లు సక్సెస్ కావడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే బుల్లితెర మీద అందరూ సీరియల్స్ ఎక్కువ గా చూస్తారు దాన్ని కాదని షోస్ చూడాలి అంటే వాళ్ల అభిరుచికి తగ్గట్టు ఆ షో లో ఏదైనా కొత్త పాయింట్ ఉండాలి.అందులో భాగంగానే బిగ్ బాస్( Bigg Boss ) వచ్చింది.

 Bigg Boss 7 Telugu Ready To Entertain With Huge Changes Details, Bigg Boss 7 Tel-TeluguStop.com

ఇప్పుడు సరికొత్త సీజన్ తో వచ్చే బిగ్ బాస్ సీజన్స్7( Bigg Boss 7 ) కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇంతటి ఎంటర్టైన్మెంట్ ని పంచిన రియాలిటీ షో గడిచిన ఆరేళ్లలో మరొకటి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇప్పటి వరకు ఈ రియాలిటీ షో తెలుగులో ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకుంది.ఇప్పుడు అతి త్వరలోనే 7 సీజన్ కూడా ప్రారంభం కానుంది.

 Bigg Boss 7 Telugu Ready To Entertain With Huge Changes Details, Bigg Boss 7 Tel-TeluguStop.com

అయితే ఆరు సీజన్స్ లో 5 సీజన్స్ ఒకదానిని మించి ఒకటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వగా, ఆరవ సీజన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు… టాస్కులు ప్రారంభం లో పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా, ఆ తర్వాతి నుండి మంచి టాస్కులనే ఏర్పాటు చేసారు.అప్పటికీ ఈ షో మీద ఆడియన్స్ కి పూర్తిగా ఆసక్తి పోవడం తో టీఆర్ఫీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

అందుకే ఈసారి 7 వ సీజన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇదే సమాయంలో సీజన్ 6 విజయవంతం కాకపోవడంతో .హోస్ట్ గా నాగార్జున ( Nagarjuna ) కూడా సీజన్ 7 ని కొనసాగించాలని అనుకోవట్లేదనే టాక్ వినిపించింది .

Telugu Bigg Boss, Bigg Boss Leaks, Bigg Boss Set, Bigg Boss Show, Chennai, Nagar

ఇక బిగ్ బాస్ నుంచి లీకులు కూడా ఎక్కువ అవుతున్నాయి .ఈ కారణంగా సెట్ ని కూడా ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేస్తారని టాక్.మొదటి సీజన్ పూణెలో బిగ్ బాస్ సెట్ వేశారు.

నామినేషన్స్ ఎలిమినేషన్ ఇలా ప్రతి దానికి ఆడియన్స్ లో ఒక ఆసక్తి ఉండేది.బిగ్ బాస్ సెట్ ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారో.

అప్పటినుంచి లీకులు మొదలయ్యాయి.సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందు రోజే తెలిసి.

ఎపిసోడ్ టై లో పెద్దగా కిక్ లేకుండా పోయింది.అందుకే సీజన్ 7 నుంచి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు హైదరాబాద్ నుంచి బిగ్ బాస్ సెట్ ని చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

అయితే అక్కడ నుంచి లీక్స్ రాకుండా కొత్త టీం ని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం .

Telugu Bigg Boss, Bigg Boss Leaks, Bigg Boss Set, Bigg Boss Show, Chennai, Nagar

బిగ్ బాస్ సీజన్ 7 టీం లో టెక్నికల్ టీం కి తెలుగు వారికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది.అంతేకాదు ఈసారి హోస్ట్ గా కొత్తవారిని దించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది .కంటెస్టంట్స్ కూడా బాగా తెలిసిన వాళ్లనే తీసుకుంటున్నారని అంటున్నారు .మొత్తానికి బిగ్ బాస్ టీం భారీ మార్పులతో సీజన్ 7ని సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు… జూలై నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం .ఈ సీజన్ లో లీక్స్ విషయంలో మాత్రం బిగ్ బాస్ సీరియస్ గా ఉంటుందని .టాస్క్ లు , ఎలిమినేషన్స్ ఏమి కూడా లీక్ కావని చెబుతున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఎవరు వస్తారు అనేది పెద్ద ప్రశ్న గా మారింది దీనికి సమాధానం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube