ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లు ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా వాట్సప్( Whatsapp ) ఉంది.వాట్సప్ తమ యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త సేఫ్టీ ఫీచర్లను( Safety Feature ) పరిచయం చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.యూజర్ల ప్రొఫైల్ పిక్చర్ ను ( Profile Picture ) ఇతరులు స్క్రీన్ షాట్స్ తీయడానికి వీలు లేకుండా ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చి యూజర్ల సేఫ్టీ మరింత పెంచింది.
వాట్సాప్ లో చాలామంది ఎప్పటికప్పుడు స్టేటస్ పెడుతుంటారు.చాలామంది స్టేటస్ ను డిస్ ప్లే పిక్చర్ గా తమ ఫోటోలను డీపీ గా పెట్టుకుంటున్నారు.ఈ ప్రొఫైల్ పిక్చర్ ను అందరూ చూడడానికి, గుర్తుపట్టడానికి లేదా ఫీలింగ్ తెలియజేయడానికి ఉపయోగిస్తారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ప్రొఫైల్ ఫోటోను డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉండేది.
ప్రొఫైల్ ఫోటోలను స్క్రీన్ షాట్( Screen Shot ) తీసుకునే అవకాశం ఉండేది.
అయితే తాజాగా వాట్సప్ అందుబాటులోకి తీసుకొచ్చిన సేఫ్టీ ఫీచర్ వల్ల ప్రొఫైల్ పిక్చర్ లేదా DP లను ఇతరులు స్క్రీన్ షాట్ తీసుకునే వీలు ఉండదు.ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి కూడా వచ్చింది.వాట్సాప్ లో ఏదైనా ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఇమేజ్ ను స్క్రీన్ షాట్ తీసే ప్రయత్నం చేస్తే.
దీనికి అనుమతి లేదంటూ స్క్రీన్ పైన ఒక నోటిఫికేషన్ ప్రత్యక్షం అవుతుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ చాలా ఫోన్లలో పనిచేయడం మొదలు పెట్టేసింది.ఇకనుండి వాట్సాప్ లో DP ఫోటోలను స్క్రీన్ షాట్ తీసే అవకాశం లేకుండా వాట్సప్ తమ యూజర్లకు మరింత భద్రత పెంచింది.