సరికొత్త ఫీచ‌ర్ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇక‌పై డేటా మ‌రింత సేఫ్‌!

ప్రజెంట్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారి అందరి ఫోన్లలో కచ్చితంగా ఉండే, అందరూ యూజ్ చేసే యాప్ వాట్సాప్.పాత తరం నుంచి మొదలుకుని ఈ తరం వరకు అందరూ ఈ యాప్‌పై అవగాహన పెంచుకున్నారు.

 Whatsapp Is Bringing The Latest Feature Data Is More Safe Now, New Feature, What-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ పేరు తెచ్చుకుంది.అయితే, కొద్దిరోజుల కిందట న్యూ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు వార్తలు రాగా, వాటి వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని కొందరు యూజర్స్ వేరే యాప్స్‌కు షిఫ్ట్ అయ్యారు.

ఈ క్రమంలోనే వాట్సా‌ప్ విమర్శలు ఎదుర్కొంది.కాగా, ఆ విషయమై వివరణ కూడా ఇచ్చింది వాట్సాప్.

వినియోగదారుల భద్రతనే ముఖ్యమని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే వ్యతిరేకత నుంచి బయటపడేందుకు, యూజర్లను మళ్లీ తన వైపునకు మలుచుకునేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నది వాట్సాప్.

యూజర్ల భద్రతే ప్రధాన లక్ష్యంగా తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్.

ప్రజెంట్ వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంది.

అనగా యూజర్స్ ఒకరి నుంచి మరొకరికి మెసేజెస్ సెండ్ చేసుకునే క్రమంలో ఆ ఇద్దరికి తప్ప వేరే వ్యక్తికి చాటింగ్ విషయాలు కనబడవు.ఆ విధంగా సిస్టమ్ రూపొందించారు.

కానీ, చాటింగ్ డేటా క్లౌడ్‌లో స్టోర్ అయితే దానికి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు.

Telugu Automatic, Beta, Cloudstorage, App Whatsapp, Whatsapp-Latest News - Telug

ఈ నేపథ్యంలో క్లౌడ్ డేటా స్టోరేజ్ బ్యాకప్స్ ఆటోమేటిక్‌గా ఎన్‌క్రిప్ట్ అయ్యేలా ఫీచర్ తీసుకొస్తున్నారు.ఈ డేటాకు 64 డిజిట్ ఎన్‌క్రిప్షన్స్ కీస్ ఇస్తున్నారు.ఒక వేళ వినియోగదారుడు ఎన్ క్రిప్షన్ పాస్‌వర్డ్ మరిచిపోతే డేటా రికవరీ చాలా కష్టం.

ప్రజెంట్ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో రిలీజ్ చేశారు.త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube