వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్ మరో ముందడుగు..!

ప్రస్తుతం ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రతి ఒకరు వినియోగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్స్ ను ప్రకటిస్తూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తుంటుంది.

ఈ తరుణంలో కొత్త సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రవేశ పెట్టడంతో అనేక సమస్యలు ఎదురుకుంది.వాట్సాప్ తీసుకున్న ప్రైవసీ పాలసీ నిబంధన వ్యక్తిగత భద్రతకు ప్రశ్నార్థకంగా మారిందని అనేక వివాదాలు వినిపించాయి.

ఈ తరుణంలో కొంతమంది వాట్సాప్ యూజర్స్ వారి వ్యక్తిగత విషయాలు బయటికి తెలుసా ఏమో అన్న సందేహంలో వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ కూడా చేసేసారు.దీంతో రంగంలోకి దిగిన వాట్సాప్ సంస్థ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైపోయింది.

ఈ క్రమంలో యూజర్ స్టేటస్ లో రూపంలో ప్రైవసీ పాలసీ లో ఎలాంటి మార్పు చేయట్లేదు అని స్పష్టంగా తెలియజేసింది.మరోవైపు వాట్సాప్ వ్యక్తిగత భద్రత కోసం తాజాగా ఒక సరికొత్త అప్డేట్ తీసుకొని వచ్చింది.

Advertisement

సాధారణంగా ఎవరైనా డెస్క్ టాప్ లో వాట్సాప్ లాగిన్ కావాలంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే సరిపోతుంది.కానీ ప్రస్తుతం మాత్రం అందుకు అనుగుణంగా వాట్సాప్ యూజర్స్ తమ ఖాతాలను కంప్యూటర్ లేదా డెస్క్ టాప్ లో లింక్ చేసుకునే ముందు, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుందని వాట్సాప్ తెలియజేసింది.

దీనితో మీ వాట్సాప్ ఖాతాలను ఇతర కంప్యూటర్లకు లింక్ చేయడానికి అడ్డుకట్టగా నిలుస్తుంది.అంతేకాకుండా ఈ ఫ్యూచర్ ఉపయోగం వల్ల డెస్కుటాప్ లో లాగిన్ అయ్యే సమయంలో ఫోన్ లో ఫేస్ ఐడియా ఫింగర్ ప్రింట్ ద్వారా చేయమని ఒక రిక్వెస్ట్ వస్తుంది.

దానిని యాక్సిస్ చేస్తేనే కంప్యూటర్ లేదా డెస్క్ టాప్ పై లాగిన్ అవ్వొచ్చు.ప్రస్తుతం ఈ సరికొత్త ఫ్యూచర్ అభివృద్ధి దశలో ఉందని త్వరలోనే పూర్తి స్థాయిలో వాట్సప్ తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు తెలియజేసింది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు