మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్( Whatsapp ) రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ వినియోగదారులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.ఈ క్రమంలో మెటా యాజమాన్యంలో ఉన్న వాట్సాప్ తన నూతన అప్‌డేట్స్‌తో కొత్త కొత్త వినియోగదారులను సైతం తన వైపుకి తిప్పుకుంటోంది.
ఈ క్రమంలోనే ప్లాట్‌ఫారమ్ టెక్ట్స్ డిటెక్షన్ ఫీచర్(Text Detection Feature )ను పరిచయం చేయాలని అనుకుంటోంది.ఇది వినియోగదారులు ఇమేజ్ నుంచి టెక్స్ట్ నుంచి సంగ్రహించడానికి అనుమతినిస్తుంది.

ఐఓఎస్ 23.5.7ను అప్‌డేట్ చేశాక ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని విశ్వసనీయ వర్గాలు అంచనా.దీనివలన వినియోగదారులు ఇమేజ్ ఫార్మాట్ లో వున్న టెక్స్ట్ ని చాలా తేలికగా కాపీ చేయవచ్చని తెలుస్తోంది.
ఇటీవల ఐఓఎస్ వినియోగదారుల కోసం వాయిస్ స్టేటస్ ఫీచర్( Voice Status Feature )ను అందించిన సంగతి విదితమే.ఆ ఫీచర్ మరువక ముందే ఈ అదిరిపోయే ఫీచర్ ఇవ్వడం పట్ల వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విండోస్ వినియోగదారుల కోసం బహుళ ఎంపిక ఫీచర్లు, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం డెస్క్‌టాప్ లాక్, కంపానియన్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నద్ధం అవుతోంది.

ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఐఓఎస్ యూజర్లు 30 సెకన్ల ఆడియోను కూడా స్టేటస్ కింద పెట్టుకునేలా అప్‌డేట్‌ను అందించి, ఔరా అనిపించింది.ఇలా చెప్పుకుంటూ పొతే వాట్సాప్ రోజుకొక కొత్త అప్డేట్ ఇస్తూ కస్టమర్లకు ఖుషి చేస్తోందని చెప్పుకోవచ్చు.ఇకపోతే వాట్సాప్ వినియోగించని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉందనే వుండరు.
అంతలా ఈ సోషల్ మెసేజింగ్ దిగ్గజం దూసుకుపోతోంది.కొన్ని సర్వేల ప్రకారం ఎవరైనా కొత్త మొబైల్ కొన్నట్లైతే మొట్ట మొదటిగా వారు తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకునేది వాట్సాప్ అని తెలుస్తోంది.







