తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి ( Alekhya reddy ) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజా పోస్ట్ తో నందమూరి ఫ్యామిలీ( Nandamuri family ) నుంచి తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అలేఖ్య ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు.
తారకరత్న ( Tarakaratna ) తల్లీదండ్రుల నుంచి ఇప్పటికీ తనకు ఎలాంటి సపోర్ట్ దక్కలేదని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు.అలేఖ్యారెడ్డి ఆవేదనను చూసి సామాన్య ప్రజలు సైతం ఫీలవుతున్నారు.
తారకరత్న భార్యకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య మాత్రమే ప్రతి నెలా ఆర్థికంగా సాయం చేసినంత మాత్రాన అలేఖ్యారెడ్డి కష్టాలు తీరవు.
ముగ్గురు పిల్లలను పెంచి పోషించి వాళ్లను ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత అలేఖ్యారెడ్డిపై ఉంది.అలేఖ్యారెడ్డికి వ్యాపారం, ఇతర రంగాలలో కూడా ఎక్కువగా అనుభవం లేదు.

తారకరత్న ఆస్తులన్నీ అలేఖ్య, ఆమె పిల్లలకు చెందేలా చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో నందమూరి కుటుంబ సభ్యుల మద్దతు అలేఖ్యారెడ్డికి అవసరం అని చెప్పవచ్చు.గడిచిన పదేళ్లలో తారకరత్న, అలేఖ్యారెడ్డి అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు.అలేఖ్యారెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమెకు తమ వంతు సహాయం అయితే చేశారని బోగట్టా.

అలేఖ్యా రెడ్డికి, ఆమె పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటే మాత్రమే తారకరత్న ఆత్మ శాంతిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా అలేఖ్యకు ఆర్థికంగా కొంతమేర సాయం చేస్తే బాగుంటుందని అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తారకరత్న కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా అన్ని సమస్యలను బాలయ్య పరిష్కరించాలని మరి కొందరు చెబుతున్నారు.మంచి మనిషిగా పేరు సంపాదించుకున్న తారకరత్న కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా ఫ్యాన్స్ సైతం తట్టుకోలేరు.
అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.







