Whatsapp : వాట్సాప్ చాట్ విండోలో సరికొత్త ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే..?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ గా వాట్సాప్( Whatsapp ) ఎంతలా ఆదరణ పొందుతుందో తెలిసిందే.వాట్సప్ తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ సేవలను మరింత సులభతరం చేస్తోంది.

 Whatsapp Adding A New Label To Indicate Conversations Are End To End Encrypted-TeluguStop.com

దీంతో రోజురోజుకు వాట్సప్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంది.గత కొంతకాలం నుంచి గమనిస్తే ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ పరిచయం చేసింది.

వాట్సప్ తన వినియోగదారులకు సెక్యూర్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్( Secure End-To-End Encryption ) అందిస్తోంది.వాట్సాప్ లో మెసేజ్ పంపినవారు, మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు తప్ప మూడో వ్యక్తి చూడలేరు.

ఈ సెక్యూరిటీ ఫీచర్ గురించి వాట్సప్ ఎప్పుడో తెలియజేసింది.అయితే తాజాగా ఈ విషయాన్ని చాట్ లోనే స్పష్టంగా తెలియజేయాలని వాట్సప్ భావిస్తోంది.

Telugu Whatsapp, Whatsapp Label, Whatsapp Ups-Technology Telugu

అందుకోసం చాట్ స్క్రీన్ పై( Chat Screen ) ప్రముఖంగా కనిపించే కొత్త లేబుల్ ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది.ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.ఈ లేబుల్ ఫీచర్ చాట్ పైన ఉండే ప్రొఫైల్ ఐకాన్ కు( Profile Icon ) పక్కన లేదా కింద ఉంటుంది.టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత వాట్స్అప్ ఆండ్రాయిడ్ బీటా లేటెస్ట్ వెర్షన్లకు యాక్సెస్ ఉన్న యూజర్లు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అప్డేట్ అందుకుంటారు.

Telugu Whatsapp, Whatsapp Label, Whatsapp Ups-Technology Telugu

ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ లేదా గ్రూప్ కింద ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్టేడ్ అనే లేబుల్ గమనించవచ్చు.వాట్సప్ యూజర్లకు డేటా భద్రతతో పాటు యూరోపియన్ యూనియన్ లోని మెసేజింగ్ యాప్ ల ఇంటర్ అపరబిలిటీ గురించి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది వాట్సప్. అందుకోసమే ఈ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.ఎన్ క్రిప్షన్ లేబుల్ తో వాట్సప్ ప్రైవసీ, సెక్యూరిటీ పట్ల నిబద్ధతను బలోపితం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube