ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా( Social Media ) ప్రభావం వ్యక్తిగత జీవితాల్లో చాలా ఎక్కువగా ఉంది.ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.
అది ఎంత ఎక్కువగా ఉంది అంటే ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లో ఫాలో కొట్టారు బాగానే ఉంది.కానీ అన్ ఫాలో చేస్తే చాలు వారు విడాకులు తీసుకుంటారు అనే విషయాన్ని దాదాపు కన్ఫర్మ్ చేసేసినట్టుగానే అందరూ నిర్ణయిస్తున్నారు.
ఒక వ్యక్తికి కోర్టు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా ఇచ్చేలా ఉంది.
ఇంస్టాగ్రామ్ లో విడాకుల హల్చల్ ఎక్కువగా నడుస్తుంది.ఆ మధ్య కాలంలో సమంత నిహారిక వంటి దారాలు ఇలాంటి పద్ధతినే ఫాలో అయ్యారు.
ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో కొట్టగానే సమంత నాగచైతన్య( Samantha Naga Chaitanya )కి మధ్య ఏదో జరుగుతుందని అంత అనుకున్నారు.
అలాగే నిహారిక( Niharika ) విషయంలో కూడా సేమ్ జరిగింది.ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సెలబ్రిటీల విడాకుల కన్ఫర్మేషన్( Divorce Confirmation ) వారే తమ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.ఇలా ప్రస్తుతం ఈ ట్రెండు నడుస్తుంది అయితే నయనతార( Nayanthara ) విషయంలో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఉంది పరిస్థితి.
ఆమె పొరపాటున చేసిందో లేక కావాలని చేసిందో తెలియదు కానీ తాజాగా ఒక సాడ్ పోస్ట్ పెట్టింది.దాంతో పాటు విగ్నేష్ ని అన్ ఫాలో చేసింది.
ఈ హఠాత్ పరిణామంతో సోషల్ మీడియాలో ఒక విప్లవమే వచ్చినంత పని అయింది.నయనతార విడాకుల బాట పట్టింది అంటూ ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వారు రాసేసుకున్నారు.
ఇంకా ఒక అడుగు ముందుకేసి భరణం ఎంత ఇవ్వాలి, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని కూడా చెప్తారు ఈ సోషల్ మీడియాలో.అంత దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం ఈ దెబ్బకు భయపడిందో ఏమో నయనతార ఉన్న ఫలంగా మళ్ళీ ఫాలో కొట్టింది.ఒకవేళ విడాకులు( Divorce ) తీసుకున్న కూడా అన్ ఫాలో చేయకూడదని భయం వచ్చినట్టుంది.మరి ఈ ట్రెండ్ రాను రాను ఎటు వెళ్తుందో ఆ తర్వాత ఎలాంటి కొత్త ట్రెండు మొదలవుతుందో ఏమో కానీ మొత్తానికి సెలబ్రిటీల గుండెల్లో హడల్ సృష్టించేటట్టుగా ఉంది ఈ ఫాలో మరియు అన్ ఫాలో బటన్.