కెసిఆర్ లో భయం పెరగడానికి కారణం ఏమిటి ?

తెలంగాణలో ని హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఇక్కడ గెలవడం ద్వారా రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలపడేందుకు అవకాశం దక్కుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ టిఆర్ఎస్ హుజూర్ నగర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.అందుకే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే టిఆర్ఎస్ అభ్యర్థిని అందరికంటే ముందుగానే ప్రకటించేశారు.

గత ఎన్నికల్లో ఓటమి చెందిన సైదిరెడ్డి ని మళ్లీ తమ అభ్యర్థిగా ఎంపిక చేశారు.హుజూర్ నగర్ లో ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ గెలిచి తీరాల్సిందేనని, దానికోసం ఎటువంటి సహకారం అయినా పార్టీ నుంచి అందిస్తామని, నిత్యం ప్రజల్లో తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి విజయానికి మూకుమ్మడిగా సహాయ సహకారాలు అందించాలని కెసిఆర్ నుంచి నియోజకవర్గంలోని చిన్నాచితక నాయకులకు సూచనలు అందాయి.

అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు.ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా ఇంచార్జీల నియామకం కూడా పూర్తి చేశారు.

Advertisement

  గత ఎన్నికల్లో వందకు పైగా స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ, ఈ ఒక్క ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా, తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా భావిస్తోంది.ఇక్కడ గెలిస్తే టిఆర్ఎస్ పార్టీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకోవడానికి వీలు పడుతుందని భావిస్తున్నారు.ఒకవేళ పొరపాటున ఓటమి చెందితే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం అవుతుందని, ప్రతిపక్షాలు దీన్ని అవకాశంగా తీసుకుని టిఆర్ఎస్ పై మాటల దాడి పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని కెసిఆర్ ఆందోళన చెందుతున్నాడు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ హుజూర్ నగర్ లో ఓటమి చెందడానికి ట్రక్కు గుర్తు కారణమని, కానీ ఈసారి అటువంటి పొరపాట్లు ఏవి జరగకుండా ఓటర్లను చైతన్యవంతం చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

  ఇప్పటికే కే హుజూర్ నగర్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ఒక్కో మండలానికి సుమారు ఐదు నుంచి ఏడుగురు వరకు ఇంచార్జీల నియామకం పూర్తి చేశారు.గ్రామ స్థాయి నుంచి ఓటర్లను కలుసుకునేందుకు తగిన ప్రణాళికను రూపొందించారు.

మండలాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించి ప్రతి గ్రామం, ప్రతి వార్డు అందులో కవర్ అయ్యేలా చేశారు.గ్రామాల్లో పార్టీ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని, ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలహీనంగా ఉన్నాము అనే విషయాన్ని ముందుగా గుర్తించి అక్కడ ప్రచారాన్ని ఉదృతం చేయాలనీ, అధికార పార్టీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇది మన పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి నాయకులంతా బాధ్యత తీసుకుని ప్రచారానికి వెళ్లాలని, ఈ సమయంలో గ్రూపు తగాదాలు లేకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు