నేనేం చేసినా తప్పులే వెతుకుతారు... ట్రోల్స్ పై స్పందించిన ప్రియాంక చోప్రా!

బాలీవుడ్ నటిగా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ప్రస్తుతం సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈసిరీస్ ఏప్రిల్ 28వ తేదీ ప్రైమ్ లో ప్రసారం కానుంది ఈ క్రమంలోని ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రియాంక చోప్రా వ్యాఖ్యల ద్వారా భారీ ట్రోల్స్ కు గురవుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తనపై వచ్చి ట్రోల్స్ పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆర్ఆర్ఆర్ ( RRR ) కు ఆస్కార్ ( Oscar ) విషయంలో ఎంతో మద్దతుగా మాట్లాడిన ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా తమిళ సినిమా అంటూ నోరు జారారు.అయితే ఈ విషయంపై ఈమెనూ తెలుగు అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు.ఇక ఈ విషయంపై స్పందించిన ఈమె కొందరు నేనేం చేసినా.

ఏం మాట్లాడినా అందులో తప్పులను వెతుకుతుంటారు.బహుశా వారికి అదే ఆనందాన్ని కలిగిస్తుందేమో.

Advertisement

అందుకే తాను ఇలాంటి విషయాలు గురించి పట్టించుకోకపోయినా జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.

ప్రస్తుతం నాకంటూ ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది అభిమానులు ఉన్నారు.నేను ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే తన ఎదుగుదలను ఓర్చుకోలేక తనను ప్రోత్సహించేవారు కన్నా కిందికి లాగే వారే ఎక్కువగా ఉంటారని అలాంటి సమయంలోనే తన అభిమానుల నుంచి వచ్చే మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు సిరీస్లలో నటిస్తూ సందడి చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు