రజనీకాంత్‌ చెప్పింది నిజమే ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గౌరవనీయులు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్( Vasantha Venkata Krishna Prasad ) గారి వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి.

మైలవరంలో అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మైలవరం( Mylavaram ) వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

ఈ రాష్ట్రం లో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను ఒకడనని అన్నారు.తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక ప్రక్క అయితే రెండో ప్రక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు.పదవులు ఇచ్చేదాకా నక్కవినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారుసినిమాలో రజనీకాంత్( Rajinikanth ) చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా!అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ
Advertisement

తాజా వార్తలు