ఇటీవల బీజేపీ ( BJP party )జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )కు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను బిజెపి అధిష్టానం అప్పగించింది.దీనిలో ఏపీ కూడా ఉండడంతో, ఆయన ఇక్కడ బిజెపిని బలోపేతం చేసే విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఓటర్ చైతన్య మహాబియాన్ కార్యక్రమంలో సంజయ్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలతో విరుచుకుపడ్డారు.
దీంతో పాటు , తమ మిత్రపక్షమైన జనసేన పై ప్రశంసలు కురిపించారు.

” తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ( CM jagan )దే. మధ్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా ? అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.
ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బిజెపిని హేళన చేశారు ఏమైంది ? హేళన చేసిన పార్టీలే నామరూపాలు లేకుండా పోయాయి.ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీపడి దోచుకుంటున్నాయి.డ్రగ్స్, గంజాయి మద్యం భూకబ్జాల దందాలతో దోచుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది .కూకటివేళ్లతో పెకలించాల్సిన సమయం ఆసన్నమైంది.ఈసారి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది.అయినా మళ్ళీ అధికారంలోకి రావాలని వైసిపి అడ్డదారులు తొక్కుతోంది ” అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10,000 పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనుల్లో నిమగ్నమైంది .కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది.అనంతపురం జడ్పీ సీఈవో ను సస్పెండ్ చేశారు.మీరంతా అప్రమత్తంగా ఉండాలి.ఏపీలో హిందూమతం పై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడుగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారు.

భక్తులను కాపాడలేక కర్రలు ఇస్తారా ? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులు ఉండవనే సంగతి గుర్తుంచుకోవాలి.కొత్తగా నియమితులైన టీటీడీ చైర్మన్ ఎవరండీ ఆయన బిడ్డ పెళ్లి క్రైస్తవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజం కాదా ? నేను నాస్తికుడని ఆయన గతంలోని చెప్పలేదా ? ఆయన రాడికల్ కాదా ఇంకా సిగ్గు లేకుండా తిరుమలలో అడవులన్న విషయం తెలవదని టీటీడీ చైర్మన్ చెబుతున్నాడట.మరి ఆయనకు పుష్ప సినిమా చూపించలేమో ” అంటూ సంజయ్ మండిపడ్డారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు.ప్రధాని నరేంద్ర మోది నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan )ఎన్డీఏలో చేరారని, పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత, ప్రజా సమస్యలపై జనంలోకి వెళ్తుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం అని సంజయ్ అన్నారు.ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు.
కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను ఆపే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.







