టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు.
ఇప్పటివరకు దాదాపుగా 150 కి పైగా సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి రియల్ లైఫ్( Real life ) లో కూడా హీరో అనిపించుకున్నారు.

ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఇటీవలే భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో చిరంజీవిపై దారుణంగా విమర్శలు చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు.చిరంజీవి సినిమాలకు బై బై చెప్పేసి విరామం తీసుకోవడం బటర్ అంటూ కొందరు విమర్శించారు.దాంతో ఆ విమర్శలపై టాలీవుడ్ లో కార్తికేయతో పాటు మరికొందరి హీరోలు కూడా స్పందించిన విషయం తెలిసిందే.
త్వరలోనే మెగాస్టార్ మరొక సక్సెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అంటూ చిరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉత్తేజ్( uttej ) కూతురు చిరంజీవి గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చిరంజీవితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన ఆమె నేను ఎంతో అదృష్టవంతురాలిని.లవ్యూ సో మచ్ పెదనాన్న.
నా జీవితంలో ఇంతకంటే గొప్ప గిప్ట్‌ను ఎవ్వరూ ఇవ్వలేరు.పెదనాన్నతో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను.
ఆయన ఎంతో మంచివారు.స్వీటెస్ట్ పర్సన్.
ఆయనే నాకు స్వయంగా భోజనం వడ్డించారంటే నమ్మలేకపోతున్నాను.ఇలా మళ్లీ భోళా శంకర్ సెట్‌లో బాస్‌ను కలవడం ఆనందంగా ఉంది అని తన పోస్టులో రాసుకొచ్చింది పాట ఉత్తేజ్.
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







