పెళ్లికి ముందే మ‌ధుమేహం బారిన ప‌డ్డారా? అయితే ఆ జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రి!

పూర్వం యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలోనే మ‌ధుమేహం వ్యాధి క‌నిపించేది.

కానీ, ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు పెళ్లికి ముందే అంటే చిన్న వ‌య‌సులోనే షుగ‌ర్ వ్యాధికి గుర‌వుతున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, అధిక బ‌రువు, జీవ‌న శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేక పోవ‌డం, పోష‌కాల కొర‌త‌, గంటలు తరబడి కూర్చోని ఉండ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు.ఇక కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా మధుమేహం వ‌స్తుంటుంది.

అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ పెళ్లికి ముందే షుగ‌ర్ వ్యాధి వ‌స్తే.దాని ప్ర‌భావం వివాహం త‌ర్వాత ఖ‌చ్చింగా ఉంటుంది.

ముఖ్యంగా సంతాన స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం చాలా అధికంగా ఉంటుంది.షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌గ‌వారిలో అంగస్తంభన లేకపోవడం, వీర్య క‌ణాలు వృద్ధి త‌గ్గిపోవ‌డం, ఉన్న క‌ణాలు బ‌ల‌హీన‌ప‌డటం వంటివి జ‌రిగితే.

Advertisement

ఆడ‌వారిలో రుతుక్రమం సరిగ్గా లేక పోవడం, గర్భం దాల్చినా నిల‌వ‌క‌పోవ‌డం జ‌రుగుతుంటుంది.అందుకే పెళ్లికి ముందే మ‌ధుమేమం బారిన ప‌డితే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

అవేంటో చూసేయండి.

ఫైబ‌ర్‌, ప్రోటీన్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు త‌ప్ప‌కుండా చేస్తాయి.మ‌రియు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.

అలాగే రక్తప్రసరణ నుంచి కణాల నిర్వహణ వరకు అన్నింటినీ నీరు ప్రభావితం చేయగలదు.అందుకే రోజుకు ప‌న్నెండు గ్లాసుల వాట‌ర్‌ను సేవించాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

నిద్ర స‌గానికి పైగా జ‌బ్బుల‌ను న‌యం చేస్తుంది.అందుకే రోజూ క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్ర పోవాలి.

Advertisement

ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.ప్ర‌తి రోజు ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయాలి.

ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయ‌డం వంటివి మానుకోండి.బ‌రువును అదుపులో ఉంచుకోండి.

ఫాస్ట్ ఫుడ్స్‌కు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.మ‌రియు ఉప్పు త‌క్కువ‌గా తీసుకోండి.

ఇవ‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.దాంతో సంతాన స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు