ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) హడావిడి మామూలుగా లేదు.అటు విపక్షాల ఐక్యత కోసం జాతీయ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉంటే ఇటు తెలంగాణలో టీ కాంగ్రెస్ నేతలు వరుస సమావేహాలతో పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.
అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని హస్తం పార్టీ పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో అటు జాతీయంగాను ఇటు రాష్ట్రీయంగాను వ్యూహాలకు పదును పెడుతోంది.
ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా టీ కాంగ్రెస్ దూకుడు గా వ్యవహరిస్తోంది.
ఊహించిన దాని కంటే ఇతర పార్టీల నుంచి చేరికలు బాగానే జరుగుతుండడంతో ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని చూస్తున్నారు హస్తం నేతలు.ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,( Ponguleti Srinivas Reddy ) జూపల్లి కృష్ణరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరారు.ఇంకా మరికొంత మంది కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నారు.
బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే బిఆర్‌ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి వాటి వారు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారట.తీగల కృష్ణరెడ్డి ఇప్పటికే టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ లతో భేటీ అయ్యారు కూడా.
ఈ విధంగా ఆయా పార్టీలలోని నేతలు వరుసగా కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో క్యాడర్ లో జోష్ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో హస్తం నేతలు బేటీ అయ్యారు.ఈ బేటీలో రేవంత్ రెడ్డితో పాటు, మాణిక్యం ఠాకూర్, భట్టి విక్రమార్క వంటి కీలక నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఎన్నికలకు వ్యూహ రచన, చేరికలు, పార్టీ స్థితిగతులపై ఈ బేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే మేనిఫెస్టో పై కూడా తుది కసరత్తు ఈ బేటీలోని జరగనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి హస్తం పార్టీ తెలంగాణలో మంచి దూకుడు మీద ఉంది.మరి ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారో చూడాలి.