బీజేపీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.గజ్వేల్ లో అకారణంగా కేసులు పెడుతున్నారన్న ఆయన అది మంచి పద్ధతి కాదని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ అయిన ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.