ఆటోమేటిక్ బ్రేక్‌లు తీసుకొస్తున్న కేంద్రం.. ఇకపై యాక్సిడెంట్స్‌ జరగవా...

కేంద్ర ప్రభుత్వం రహదారులను సురక్షితంగా మార్చాలని, ప్రమాదాలను తగ్గించాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే వెహికల్ టు ఎవ్రీథింగ్ (V2X) అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించాలని యోచిస్తోంది.

 What Is Vehicle-to-everything V2x Technology And How Does It Work Details, Centr-TeluguStop.com

ఈ టెక్నాలజీని ముందుగా కార్లలో,( Cars ) తర్వాత ఇతర వాహనాల్లో ఉపయోగించనున్నారు.ఈ టెక్నాలజీ గురించి కేంద్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

V2X టెక్నాలజీ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగం.ఈ ప్రోగ్రామ్ ప్రయాణీకులను, పర్యావరణాన్ని ఎంతవరకు రక్షిస్తుందనే దాని ఆధారంగా కార్లకు భద్రతా రేటింగ్‌లను ఇస్తుంది.

భారతదేశంలో తయారయ్యే అన్ని కార్లకు V2X టెక్నాలజీని తప్పనిసరి చేయాలా వద్దా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.రవాణా, టెలికమ్యూనికేషన్ శాఖల అధికారుల కమిటీ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.

Telugu Central, Roads, Vx, Vehicle, Vehicles-Latest News - Telugu

వైఫై సిగ్నల్‌లను( WiFi ) ఉపయోగించడం ద్వారా V2X టెక్నాలజీ పని చేస్తుంది.ఇది రోడ్డుపై ఇతర వాహనాల స్థానం, వేగాన్ని పసిగట్టగలదు.ఢీకొనే ప్రమాదం ఉన్నట్లయితే డ్రైవర్లను హెచ్చరిస్తుంది.ఇది ట్రాఫిక్ పరిస్థితులు, పాదచారులు, టోల్ గేట్లు, రోడ్డు సైన్స్, ఇతర ప్రమాదాల గురించి డ్రైవర్లను( Drivers ) కూడా హెచ్చరిస్తుంది.

వాహనాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే, V2X సాంకేతికత ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి వాహనాలను ఆపగలదు.ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీల్లో ఉన్న సేఫ్టీ ఫీచర్ల కంటే ఈ టెక్నాలజీ మరింత ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Central, Roads, Vx, Vehicle, Vehicles-Latest News - Telugu

ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) భారీగా తగ్గుతాయి.మన ఇండియాలో ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వాటి అన్నిటినీ ఆపగలడం వల్ల నిండు ప్రాణాలను కాపాడవచ్చు.కుటుంబంలో కడుపు కోతలకు చెక్ పెట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube