అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ని ఏర్పాటు చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక దీనికంటే ముందే రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన రణ్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన ‘అనిమల్ ‘ సినిమా( Animal ) సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.అయితే అనిమల్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు స్పిరిట్ సినిమా మీద చాలా కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాతో తను ఇండియాలోనే ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే అనిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి 2023 వ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేయబోయే స్పిరిట్ సినిమా( Spirit movie ) మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే స్పిరిట్ సినిమాకి అనిమల్ సినిమాకి మధ్య ఒక సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక స్పిరిట్ సినిమాలో రన్బీర్ కపూర్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

బహుశా ఇది సందీప్ రెడ్డివంగా యూనివర్స్ కింద తెరకెక్కుతున్న సినిమా కావచ్చు అని ఇంకొంతమంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రివ్ చేసుకోవాలని సందీప్ రెడ్డి వంగా చాలా ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా కనక సూపర్ హిట్ అయితే సందీప్ వంగ ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు…
.